Honor: హానర్.. పవర్‌బ్యాంక్ లాంటి ఫోన్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

Honor
x

Honor: హానర్.. పవర్‌బ్యాంక్ లాంటి ఫోన్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

Highlights

Honor: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్.. తక్కువ ధరలో భారీ బ్యాటరీతో కూడిన కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేయనుంది.

Honor: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్.. తక్కువ ధరలో భారీ బ్యాటరీతో కూడిన కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ పేరు హానర్ X80అని, ఈ ఫోన్‌లో 10,000mAh భారీ బ్యాటరీ ఉండవచ్చని లీక్స్ ద్వారా తెలిసిన సమాచారం. ఈ ధర రేంజ్‌లో ఇంత పెద్ద బ్యాటరీ ఉండటం చాలా అరుదు. ఈ బ్యాటరీ వల్ల ఫోన్ పవర్ బ్యాంక్‌లా పని చేస్తుంది. హానర్ X80 గురించి ఇప్పటికే చాలా సార్లు లీక్స్ వచ్చాయి. ఇప్పుడు ధర వివరాలు కూడా బయటపడ్డాయి. తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

ఫేమస్ టెక్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ హానర్ X80 ధర గురించి సమాచారం షేర్ చేశాడు. ఈ ఫోన్ చైనాలో సుమారు 1,000 యువాన్ (భారతదేశంలో దాదాపు రూ.12,000) ధరలో లాంచ్ అవుతుందని చెప్పాడు. ఈ ధర నిజమైతే లో రేంజ్, మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హానర్ X80 బలమైన పోటీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ ధరలో 10,000mAh బ్యాటరీ ఇచ్చే మరొక ఫోన్ లేదు. హానర్ X80లో 6.81 ఇంచ్ డిస్‌ప్లే ఉండవచ్చు. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్‌తో షార్ప్‌గా కనిపిస్తుంది. ఫ్లాట్ LTPS డిస్‌ప్లే ప్యానెల్ ఉపయోగిస్తారని లీక్స్ చెబుతున్నాయి. డిస్‌ప్లే కార్నర్లు రౌండెడ్‌గా ఉండి ఆధునిక లుక్ ఇస్తాయి. గేమింగ్, స్ట్రీమింగ్ కోసం పెద్ద స్క్రీన్ కావాలనుకునే వారికి ఇది బాగుంటుంది.

ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7-సిరీస్ ప్రాసెసర్ ఉండవచ్చు. టిప్‌స్టర్ ప్రకారం లో-పవర్ చిప్‌సెట్ ఉపయోగిస్తారు. పవర్ ఎఫిషియెన్సీపై ఎక్కువ దృష్టి పెడతారు. కొన్ని రిపోర్టుల్లో స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 చిప్‌సెట్ ఉండవచ్చని చెప్పారు. ఈ ప్రాసెసర్ బ్యాటరీ లైఫ్‌ను గణనీయంగా పెంచుతుంది. 10,000mAh బ్యాటరీ హానర్ X80లో అతి పెద్ద ఆకర్షణ. లో-మిడ్ రేంజ్ ఫోన్లలో ఇంత పెద్ద బ్యాటరీ చాలా అరుదు. ఒక్క ఛార్జ్‌తో రెండు మూడు రోజులు ఉపయోగించవచ్చు. గేమర్లు, కంటెంట్ స్ట్రీమర్లు, తరచూ ఛార్జ్ చేయడం ఇష్టం లేని వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

హానర్ X80 చైనా క్వాలిటీ సర్టిఫికేషన్ డేటాబేస్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్‌లో 5G సపోర్ట్ ఉందని నిర్ధారణ అయింది. ఆధునిక నెట్‌వర్క్ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. బ్యాటరీ ఫోకస్‌డ్ స్మార్ట్‌ఫోన్లకు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయవచ్చు. హానర్ X80 మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో బలమైన పోటీ సృష్టిస్తుంది. అత్యధిక బ్యాటరీ ఎండ్యూరెన్స్ వల్ల ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. ఒక రోజులో రెండుసార్లు ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. హానర్ ఇంకా అధికారిక లాంచ్ డేట్ ప్రకటించలేదు. కానీ లీక్స్ ప్రకారం.. త్వరలో లాంచ్ అవుతుందని అంచనా.

Show Full Article
Print Article
Next Story
More Stories