HMD New Feature Phones: HMD నుంచి రెండు కొత్త ఫోన్లు.. ఇవి మీ దగ్గర ఉంటే హీరోలా ఫీలైపోవచ్చు..!

HMD 130, 150 Music Focused Phones Launched in India
x

HMD New Feature Phones: HMD నుంచి రెండు కొత్త ఫోన్లు.. ఇవి మీ దగ్గర ఉంటే హీరోలా ఫీలైపోవచ్చు..!

Highlights

HMD New Feature Phones: HMD భారతదేశంలో HMD 150 మ్యూజిక్, HMD 130 మ్యూజిక్ అనే రెండు కొత్త ఫీచర్ ఫోన్‌లను విడుదల చేసింది.

HMD New Feature Phones: HMD భారతదేశంలో HMD 150 మ్యూజిక్, HMD 130 మ్యూజిక్ అనే రెండు కొత్త ఫీచర్ ఫోన్‌లను విడుదల చేసింది. ఈ రెండు మోడల్స్ అద్భుతమైన ఫీచర్లతో వచ్చాయి. పెద్ద ఆడియో కోసం 2W లౌడ్ స్పీకర్, మ్యూజిక్ కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. అలాగే 2,500mAh రియూవబుల్ బ్యాటరీ ఉంది. ఇది మాత్రమే కాకుండా ఈ ఫోన్‌ UPI పేమెంట్ సపోర్ట్, ఇంటిగ్రేటెడ్ ఫ్లాష్‌లైట్ కూడా ఉన్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

HMD 150 Music, HMD 130 Music Features And Specifications

HMD 150 మ్యూజిక్,HMD 130 మ్యూజిక్ మోడల్‌లు రెండూ సాధారణ పాలికార్బోనేట్ డిజైన్‌లో వస్తాయి, ముందు వైపున న్యూమరిక్ కీప్యాడ్, వెనుక పెద్ద స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌లు 2.4-అంగుళాల QVGA డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి, అయితే ఈ ఫోన్‌ల ప్రధాన ఆకర్షణ వాటి 2W స్పీకర్లు. ఈ స్పీకర్ బిగ్గరగా, స్పష్టమైన ఆడియోను అవుట్‌పుట్‌ అందిస్తాయి. అలానే మ్యూజిక్ కంట్రోల్ బటన్ కూడా ఉంటుందని HMD పేర్కొంది. ఈ ఫోన్‌లు 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో వస్తాయి. వైర్‌లెస్, వైర్డు FM రేడియో, FM రికార్డింగ్ రెండింటికి సపోర్ట్ చేస్తాయి.

వినియోగదారులు SD కార్డ్ స్లాట్ ద్వారా 32GB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ కూడా ఒక ముఖ్యమైన ఫీచర్, ఇది వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు లేదా స్పీకర్‌లతో జత చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఫోన్లలో 2,500mAh రిమూవబుల్ బ్యాటరీ ఉంది. HMD 150 మ్యూజిక్, 130 మ్యూజిక్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఒక నెల వరకు స్టాండ్‌బై టైమ్ లభిస్తుంది. ఇతర ముఖ్యమైన ఫీచర్‌లలో బిల్ట్ ఇన్ UPI పేమెంట్ సపోర్ట్, ఇంటిగ్రేటెడ్ ఫ్లాష్‌లైట్ కూడా ఉన్నాయి. HMD 150 మ్యూజిక్‌లో మాత్రమే వెనుకవైపు QVGA కెమెరా ఉంది, ఇది UPI లావాదేవీలను స్కాన్ చేయడానికి. చెల్లించడానికి ఉపయోగించవచ్చు.

HMD 150 Music, HMD 130 Music Price

HMD 130 మ్యూజిక్, HMD 150 మ్యూజిక్ ఇప్పుడు భారతదేశంలో విడుదల అయ్యాయి. అలానే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. HMD 130 మ్యూజిక్ ధర 1,899 INR కాగా, HMD 150 మ్యూజిక్ ధర 2,399 INR. ఈ రెండు మోడల్‌లు దేశంలోని ప్రధాన రిటైల్ స్టోర్‌లు, HMD అధికారిక వెబ్‌సైట్, ప్రధాన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories