ఈ టీవీ ధర విన్నాక కారు కొనే ఆలోచన వస్తుంది..! హైసెన్స్ నుంచి కొత్త UX ULED సిరీస్ లాంచ్

ఈ టీవీ ధర విన్నాక కారు కొనే ఆలోచన వస్తుంది..! హైసెన్స్ నుంచి కొత్త UX ULED సిరీస్ లాంచ్
x
Highlights

ప్రపంచ ప్రీమియం టీవీ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైసెన్స్ (Hisense), తాజాగా భారత మార్కెట్లో UX ULED RGB Mini-LED సిరీస్‌ను ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో 100 అంగుళాలు, 116 అంగుళాల భారీ సైజు టీవీలు అందుబాటులోకి వచ్చాయి.

ప్రపంచ ప్రీమియం టీవీ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైసెన్స్ (Hisense), తాజాగా భారత మార్కెట్లో UX ULED RGB Mini-LED సిరీస్‌ను ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో 100 అంగుళాలు, 116 అంగుళాల భారీ సైజు టీవీలు అందుబాటులోకి వచ్చాయి. RGB Mini-LED టెక్నాలజీతో వస్తున్న ఈ టీవీలు వేల సంఖ్యలో డిమ్మింగ్ జోన్లను కలిగి ఉండి, 95% BT.2020 కలర్ కవరేజ్‌తో గరిష్టంగా 8,000 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తాయి. దీంతో ప్రతి విజువల్ మరింత క్లారిటీగా, సహజంగా కనిపిస్తుంది. అదనంగా 3×26-bit డిమ్మింగ్ యాక్యూరసీతో తక్కువ బ్లూ లైట్ ఉత్పత్తి కావడం వల్ల కళ్లకు హానికరం కాకుండా ఉంటాయి.

హైసెన్స్ H7 పిక్చర్ ఇంజిన్, Hi-View AI Engine X తో కూడిన ఈ టీవీలు, రియల్ టైమ్‌లో కంటెంట్‌ను బట్టి పిక్చర్, సౌండ్, ఎనర్జీ వినియోగాన్ని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తాయి. PANTONE™ Validation తో 3D Colour Master PRO, HDR10+, Dolby Vision IQ, IMAX Enhanced, MEMC వంటి ఫీచర్లతో థియేటర్ అనుభవాన్ని ఇంట్లోనే అందిస్తాయి. గేమర్స్ కోసం 165Hz Game Mode Ultra, VRR, FreeSync Premium Pro, Nvidia G-Sync వంటి ప్రత్యేక సదుపాయాలు ఇవ్వబడ్డాయి. అలాగే Game Bar ద్వారా లైవ్ గేమ్ పనితీరును మానిటర్ చేసే అవకాశం ఉంది.

ఆడియో విభాగంలో Devialet భాగస్వామ్యంతో రూపొందించిన 6.2.2 CineStage X Surround System, టాప్-ఫైరింగ్ స్పీకర్లు, సబ్‌వూఫర్, Dolby Atmos, WiSA SoundSend సపోర్ట్‌తో కలిపి 110W సౌండ్ అవుట్‌పుట్ ఇస్తుంది. గూగుల్ టీవీ, Alexa, Google Assistant, Apple HomeKit, AirPlay వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇక 28 భాషల సపోర్ట్‌తో పాటు 8 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ గ్యారంటీ లభిస్తుంది. పర్యావరణ స్నేహపూర్వకంగా సోలార్ పవర్డ్ USB-C రిమోట్‌ను కూడా అందిస్తున్నారు. ధరల విషయానికి వస్తే ఈ UX ULED RGB Mini-LED సిరీస్ టీవీలు రూ.9,99,999 నుంచి రూ.29,99,999 వరకు లభ్యమవుతాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories