Google సంచలన యాప్‌: నెట్‌ లేకున్నా ఫోన్‌లో ఏఐ వాడుకోండి! — AI Edge Gallery App Launch

Google సంచలన యాప్‌: నెట్‌ లేకున్నా ఫోన్‌లో ఏఐ వాడుకోండి! — AI Edge Gallery App Launch
x
Highlights

Google నుండి మరో సంచలనం — ‘AI Edge Gallery’ యాప్‌ అధికారికంగా లాంచ్‌ అయింది. ఈ యాప్‌ ద్వారా ఇంటర్నెట్‌ లేకుండానే Artificial Intelligence (AI) ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. ఫాస్ట్‌ ప్రాసెసింగ్‌, పూర్తి ప్రైవసీ, ఆఫ్‌లైన్‌ ఏఐ అనుభవం — అన్ని ఒకే చోట!

Google నుండి మరో సూపర్ ఇన్నోవేషన్!

టెక్నాలజీ రంగంలో ప్రతీ రోజు కొత్త మార్పులు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence) రంగంలో మరింత వేగం పెరుగుతోంది. ఈ క్రమంలో Google మరో అద్భుతమైన యాప్‌ను విడుదల చేసింది — అదే ‘AI Edge Gallery’ App.

ఇది సాధారణ యాప్ కాదు, ఈ యాప్ ద్వారా మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా AI మోడల్స్‌ను ఉపయోగించుకోవచ్చు!

ఇంటర్నెట్ లేకున్నా ఫుల్ ఏఐ ఫీచర్లు

సాధారణంగా ఏ ఏఐ యాప్ వాడాలన్నా నెట్‌ అవసరం ఉంటుంది. కానీ, ఈ AI Edge Gallery App మాత్రం పూర్తిగా విభిన్నంగా ఉంటుంది.

ఈ యాప్ ద్వారా —

  • Image Creation
  • Code Writing
  • Answer Generation
  • Content క్రియేషన్ లాంటివి చేయవచ్చు.

ఇది అంతా Offline Mode లోనే!

User Privacyకి పూర్తి రక్షణ

ఇది యూజర్ ప్రైవసీ (User Privacy)కి ఎటువంటి హాని కలిగించదు. ఎందుకంటే మీరు అందించే డేటా క్లౌడ్ సర్వర్లకు వెళ్లదు. అన్ని ఆపరేషన్లు మీ మొబైల్‌లోనే లోకల్‌గా ప్రాసెస్ అవుతాయి.

దీంతో సెక్యూరిటీ రిస్క్ తగ్గుతుంది, ప్రాసెసింగ్ స్పీడ్ పెరుగుతుంది, రిప్లయ్‌లు వెంటనే వస్తాయి.

Gemma 31B Model ఆధారంగా డెవలప్‌మెంట్

Google AI Edge Gallery యాప్‌ Gemma 31B Language Model పై ఆధారపడి పనిచేస్తుంది.

  1. ఫైల్ సైజు: కేవలం 529 MB
  2. లైసెన్స్‌: Apache 2.0
  3. టోకెన్స్‌ ప్రాసెసింగ్‌ స్పీడ్‌: సెకనుకు 2,585 tokens/sec
  4. కంటెంట్‌ జనరేషన్‌, డాక్యుమెంట్‌ విశ్లేషణ, స్మార్ట్‌ రిప్లయ్‌లలో అత్యద్భుత పనితీరు.

Education, Business యూజ్‌కి కూడా సరైనది

Gemma మోడల్ చిన్నదైనా, బలమైన పనితీరును చూపుతుంది. ఇది Education, Business Applications, AI Research వంటి అన్ని ఫీల్డ్స్‌లో ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం ఈ యాప్‌ Open Source Versionలో Android కోసం అందుబాటులో ఉంది.

త్వరలోనే iOS (Apple) వెర్షన్‌ను కూడా Google విడుదల చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories