Google Pixel 9a: గూగుల్ పిక్సెల్ 9ఏ వచ్చేసింది.. ఫీచర్స్ ఇవే..!

Google Pixel 9a: గూగుల్ పిక్సెల్ 9ఏ వచ్చేసింది.. ఫీచర్స్ ఇవే..!
x

Google Pixel 9a: గూగుల్ పిక్సెల్ 9ఏ వచ్చేసింది.. ఫీచర్స్ ఇవే..!

Highlights

Google Pixel 9a: గతేడాది గూగుల్ తన గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్‌ మూడు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది.

Google Pixel 9a: గతేడాది గూగుల్ తన గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్‌ మూడు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ పిక్సెల్ 9 సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఇతర ముఖ్యమైన వివరాలు లాంచ్‌కు ముందే లీక్ అయ్యాయి.

కంపెనీ రెగ్యులర్ పిక్సెల్ సిరీస్‌తో పాటు, ఏ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేయనుంది. పిక్సెల్ 9 లాంచ్ అయినప్పటి నుండి, పిక్సెల్ అభిమానులు పిక్సెల్ 9a కోసం ఎదురు చూస్తున్నారు. మీరు కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనే ఆలోచనలో ఉన్నట్లయితే గూగుల్ త్వరలో ఫోనన్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది.

Google Pixel 9a Price

యూరోపియన్ మార్కెట్‌లో గూగుల్ పిక్సెల్ 9a 128GB వేరియంట్‌ ధర దేశంలో సుమారు రూ. 50,200. 256GB వేరియంట్‌ను ధర రూ. 55,700కు విడుదల చేయచ్చు. దీనిని అమెరికన్ మార్కెట్‌లో దాదాపు $499 అంటే సుమారు రూ. 43,400గా ఉండే అవకాశం ఉంది. అయితే ఈసారి 'A' సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల డిజైన్‌లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి, ఇందులో కెమెరా మాడ్యూల్‌ను బాడీతో అనుసంధానం చేశారు. ఈ కారణంగా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

Google Pixel 9a Features And Specifications

గూగుల్ పిక్సెల్ 9aలో 6.3-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలానే గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్, 8GB RAM+ 128GB/25 స్టోరేజ్ ఉంటుంది. కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. వాటిలో 48MP, 13MP సెన్సార్లు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories