Google Gifts: గూగుల్ బర్త్ డే.. రూ.63,714 గిఫ్ట్.. ఎలా దక్కించుకోవాలో తెలుసా..?

Google Gifts
x

 Google Gifts

Highlights

Google Gifts: గూగుల్ సెప్టెంబర్ 19 న తన పుట్టినరోజు సందర్భంగా పిక్సెల్ 9 ప్రోపై భారీ ఆఫర్లు అందిస్తోంది. ట్రేడ్ ఇన్ ప్రోగ్రామ్‌ ద్వారా రూ.63,714 వరకు రీఫండ్ అందిస్తోంది.

Google Gifts: టెక్ దిగ్గజం గూగుల్ సెప్టెంబర్ 19 న తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోనుంది. ఈ సందర్భంగా కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 9 ప్రో, ఇతర మోడళ్లపై భారీ ఆఫర్లు అందిస్తోంది. మీరు గూగుల్ నుంచి కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే ఆలస్యం చేయకుండా ఆలోచించకుండా వెంటనే హ్యాంట్‌సెట్‌ను కొనుగోలు చేయండి. ఎందుకంటే కంపెనీ ప్రస్తుతం దాని పిక్సెల్ 9 ప్రో సిరీస్ ఫోన్‌లో ట్రేడ్ ఇన్‌తో సుమారు రూ.63,714 వరకు రీఫండ్ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ కోసం మీరు తప్పనిసరిగా కంపెనీ కొత్త టాప్ టైర్ గ్యాడ్జెట్ కలిగి ఉండాలి. అంతే కాదు ఈ భారీ తగ్గింపుతో గూగుల్ బర్త్ డే కీచైన్ ను కూడా గూగుల్ అందిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

గూగుల్ తన పుట్టినరోజు వేడుక సందర్భంగా, Google Pixel 9 Pro, Pixel 9 Pro XL, Pixel 9 Pro ఫోల్డ్‌పై భారీ రీఫండ్స్ అందిస్తోంది. ఇది కాకుండా మీరు పిక్సెల్ 8 ప్రో, పిక్సెల్ 7 ప్రో, పిక్సెల్ 6 ప్రో ఫోన్‌లపై గొప్ప తగ్గింపు ఆఫర్‌లను కూడా పొందుతున్నారు. విశేషమేమిటంటే ఈ తగ్గింపు ఆఫర్ ఏ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న పిక్సెల్ ప్రో సిరీస్‌లోని ఏ మోడల్‌కైనా అందుబాటులో ఉంటుంది.

మీరు Pixel 9 Pro ఫోన్‌కు బదులుగా ఓల్డ్ జనరేషన్ Pixel 8 Pro ఫోన్‌ని కలిగి ఉంటే మీరు ఈ తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. కంపెనీ పిక్సెల్ 8 ప్రో ఫోన్‌పై $699 అంటే సుమారు రూ. 58,611 భారీ రీఫండ్ ఇస్తోంది. అయితే Pixel 7 Pro ఫోన్‌పై $540 వరకు తగ్గింపు అంటే సుమారు రూ. 45,279 అందుబాటులో ఉంది. Pixel 8 సిరీస్ ఫోన్ ధర $490 అంటే సుమారు రూ. 41,085, Pixel 6 Pro ధర $450 అంటే సుమారు రూ. 37,731.

గూగుల్ ట్రేడ్ ఇన్ ప్రోగ్రామ్‌లో భాగంగా మీరు ఫోన్‌ను ఆర్డర్ చేసేటప్పుడు ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆపై మీ కొత్త ఫోన్ వచ్చినప్పుడు మీ ట్రేడ్-ఇన్‌ను కంపెనీకి తిరిగి పంపాలి. మీకు వాపసు ఇచ్చే ముందు మర్చంట్ దాన్ని చెక్ చేస్తారు. దీని తర్వాత మీరు ఈ భారీ రీఫండ్ డిస్కౌంట్ పొందుతారు.

ఈ పుట్టినరోజు వేడుకలో భాగంగా, గూగుల్ బోనస్‌గా "గూగుల్ బర్త్‌డే కీచైన్"ని కూడా ఉచితంగా అందిస్తోంది. ఈ కీ చైన్ ధర $10 అంటే సుమారుగా రూ. 838. ఇది లిమిటెడ్ డీల్ అని గూగుల్ వెల్లడించింది. కాబట్టి వెంటనే ఫోన్‌ని కొనుగోలు చేయండి. కీ చైన్ , రీఫండ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories