Youtube: యూట్యూబ్‌ అకౌంట్ హ్యాక్‌ అయిందా.? ఏఐ టూల్‌తో పరిష్కారం..

Google introducing new AI tool that can recover hacked youtube accounts
x

Youtube: యూట్యూబ్‌ అకౌంట్ హ్యాక్‌ అయిందా.? ఏఐ టూల్‌తో పరిష్కారం.. 

Highlights

వీడియోలు క్రియేట్ చేసే వారి అకౌంట్స్‌ను హ్యాక్‌ చేసిన కీలకమైన ఇన్ఫర్మేషన్‌ను కాజేస్తున్నారు. ఇటీవల ఈ సమస్య మరింత ఎక్కువైంది

యూట్యూబ్‌ ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌కు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది మంది యూజర్లు యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారు. అదే సంఖ్యలో వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేయడం ద్వారా రూ. లక్షలు సంపాదిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే యూట్యూబ్‌కు ఆదరణ పెరుగుతుందన్న దాంట్లో ఎంత నిజం ఉందో హ్యాకర్ల బెడద కూడా అంతే ఉందని చెప్పాలి.

వీడియోలు క్రియేట్ చేసే వారి అకౌంట్స్‌ను హ్యాక్‌ చేసిన కీలకమైన ఇన్ఫర్మేషన్‌ను కాజేస్తున్నారు. ఇటీవల ఈ సమస్య మరింత ఎక్కువైంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ సిద్ధమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో యూట్యూబ్‌ హ్యాకర్లకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త టూల్‌ను రూపొందిస్తోంది. యూట్యూబ్‌ అకౌంట్ హ్యాక్‌ కావడం వల్ల యూజర్లు చేసేది ఏం లేక మరో కొత్త ఛానల్ ఓపెన్‌ చేసుకునే పరిస్థితి వస్తోంది.

దీంతో అప్పటి వరకు ఉన్న సబ్‌స్క్రైబర్స్‌ను వదులుకునే పరిస్థితి వస్తుంది. అయితే ఇకపై ఈ సమస్య ఉండదు. ఇందుకోసం గూగుల్ అకౌంట్‌, మీ యూట్యూబ్‌ ఛానెల్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతూ లాగిన్‌ను పునరుద్ధరిస్తుంది. అనంతరం హ్యాకర్‌ ఏమైనా మార్పులు చేసి ఉంటే వాటిని తొలగించి పూర్వస్థితికి తీసుకొస్తుంది. ఈ ఏఐ ఆధారిత టూల్‌ క్రియేటర్లకు ఎంతగానో ఉపయోగపడనుందని గూగుల్ చెబతోంది.

ఈ ఏఐ టూల్ ఒకవేళ మీ ఖాతా హ్యాక్‌ అయినట్లు నిర్ధారిస్తే.. వెంటనే గూగుల్‌ సపోర్ట్‌ను సంప్రదించాల్సిన అవసరం లేకుండానే రికవర్‌ చేసేందుకు అనుమతి ఇస్తుంది. ప్రొఫైల్‌ పిక్చర్‌, యాడ్‌సెన్స్‌ అకౌంట్‌లో మార్పులు సహా అనుమతి లేకుండా జరిగిన వాటిని ముందుగా నిర్ధరించుకోవాల్సి ఉంటుంది. అదే నిజమైతే యూట్యూబ్‌ హెల్ప్‌ సెంటర్ ద్వారా టూల్‌ను ఉపయోగించుకొని అకౌంట్‌ను రికవర్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంగ్లిష్‌లోనే అందుబాటులో ఉన్న ఈ టూల్‌ను త్వరలోనే ఇతర భాషల్లోనూ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories