Jio Recharge Plans: డేటాను ఎక్కువగా ఉపయోగించేవారికి గుడ్ న్యూస్..యూజర్లకోసం జియో తీసుకొచ్చిన స్పెషల్ రీఛార్జ్ ప్లాన్స్

Jio Recharge Plans
x

Jio Recharge Plans: డేటాను ఎక్కువగా ఉపయోగించేవారికి గుడ్ న్యూస్..యూజర్లకోసం జియో తీసుకొచ్చిన స్పెషల్ రీఛార్జ్ ప్లాన్స్

Highlights

Jio Recharge Plans: భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం జియో ఇప్పుడు కొన్ని స్పెషల్ రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. రోజువారీగా ఎక్కువ డేటాను ఉపయోగించేవారికి ఎక్కువ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.

Jio Recharge Plans: భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం జియో ఇప్పుడు కొన్ని స్పెషల్ రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. రోజువారీగా ఎక్కువ డేటాను ఉపయోగించేవారికి ఎక్కువ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ రీచార్జ్ ప్లాన్ల వివరాలు...

జియో రూ. 198 రీఛార్జ్ ప్లాన్

ఈ ప్లాన్‌లో యూజర్లు ప్రతి రోజూ 2జిబి డేటాను పొందుతారు అదేవిధంగా అన్ లిమెటెడ్ కాలింగ్‌ని పొందవచ్చు. రోజువారీగా 100 ఎస్ఎమ్ఎస్‌లు ఉపయోగించుకోవచ్చు. ఇక 5జి నెట్ వర్క్, 5జి స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉన్న యూజర్లు అన్ లిమిటెడ్ 5జి డేటాను వాడుకోవచ్చు. వీటితోపాటుగా జియో ఏఐక్లౌడ్, జియోటీవీ యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 14 రోజులు ఉంటుంది.

రూ.349 రీఛార్జ్ ప్లాన్

ఈ ప్లాన్‌లో ప్రతిరోజు 2జిబి డేటాను ఉపయోగించుకోవచ్చు. అలాగే అన్ లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 ఎస్ఎమ్ఎస్‌లు ఉంటాయి. ఈ ప్లాన్ వాలిడిటే 28 రోజులు అంటే మొత్తంగా ఈ 28 రోజుల్లో 56 జిబి 4జి డేటాను పొందుతారు. దీంతోపాటు అన్ లిమిటెడ్ 5జి డేటాను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్ స్టార్ సబ్‌ స్క్రిప్షన్ పొందవచ్చు. అదేవిధంగా జియోటీవీని కూడా ఉపయోగించుకోవచ్చు.

రూ. 445 రీఛార్జ్ ప్లాన్

ఈ ప్లాన్‌లో కూడా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 ఎస్ఎమ్ఎస్‌లు ఉన్నాయి. రోజువారీ డేటా 2జిబి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. అంటే మొత్తంగా 56 జిబి 4జి డేటా పొందవచ్చు. అదేవిధంగా అన్‌లిమిటెడ్ 5జి డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో సోని లివ్, జీ5, సన్ NXT తో పాటు మరికొన్ని సబ్ స్క్రిప్షన్స్ ఉన్నాయి. వీటితోపాటు జియో ఏఐక్లౌడ్, జియో ఆప్‌లు ఫ్రీ.

ఈ ప్లాన్స్ తో పాటు 56 రోజల వ్యాలిడిటీ ఉండి, రోజువారీ 2జిబి డేటాను పొందే రూ.629 రీఛార్జ్ ప్లాన్, రోజువారీ డేటా 2జిబి, 70 రోజుల వాలిడిటీ ఉండే రూ.719 రీఛార్జ్ ప్లాన్, 72 రోజుల వ్యాలిడిటీ, రోజువారీ 2జిబి డేటాను పొందగలిగే రూ.749 రీఛార్జ్ ప్లాన్లు జియో తమ యూజర్ల కోసం తీసుకొచ్చింది. ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ ఈ ప్లాన్స్‌లో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories