Jio Hotstar: జియో హాట్‌స్టార్‌ ఉచితంగా పొందాలా.? ఇదిగో ఆప్షన్స్‌..!

Get Jio Hotstar for Free with These Plans
x

Jio Hotstar: జియో హాట్‌స్టార్‌ ఉచితంగా పొందాలా.? ఇదిగో ఆప్షన్స్‌..!

Highlights

Jio Hotstar: జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ విలీనమై జియో హాట్‌స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ప్లాట్‌ఫామ్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్‌ అందుబాటులోకి వచ్చాయి.

Jio Hotstar: జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ విలీనమై జియో హాట్‌స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ప్లాట్‌ఫామ్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. దీంతో మొన్నటి వరకు జియో సినిమాలో క్రికెట్‌ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించిన యూజర్లు ఇప్పుడు డబ్బులు చెల్లించక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే కొన్ని రీఛార్జ్‌ ప్లాన్స్‌తో ఈ సేవలను ఉచితంగా పొందే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జియో ఫైబర్‌ రూ. 999 ప్లాన్‌.

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 150Mbps స్పీడ్‌ అన్‌లిమిటెడ్‌ డేటా, అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్‌ లభిస్తాయి. అలాగే వీటితో పాటు 8 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఉచితంగా సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. వీటిలో జియో హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ కూడా ఉన్నాయి.

జియో ఫైబర్‌ రూ. 2799 ప్లాన్‌: ఈ ప్లాన్‌లో 500Mbps స్పీడ్‌ అన్‌లిమిటెడ్‌ డేటా లభిస్తుంది. 3 నెలల వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వంటి 8కిపైగా ఓటీటీలను ఉచితంగా పొందొచ్చు.

జియో ఫైబర్‌ రూ. 5994 ప్లాన్‌: ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 6 నెలల వ్యాలిడిటీ లభిస్తుంది. 1 జీబీపీఎస్‌ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్‌ డేటా పొందొచ్చు. అలాగే జియో హాట్‌స్టార్‌తో పాటు మరో 8కిపైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

జియో ఫైబర్‌ రూ. 11988 ప్లాన్‌: ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే ఏడాది వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. అలాగే 1 జీబీపీఎస్‌ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్‌ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ లభిస్తాయి. అలాగే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌, జియోస్టార్‌ సహా 8కి పైగా ఓటీటీలను ఉచితంగా పొందొచ్చు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా: BSNL కూడా ఇలాంటి ఒక మంచి ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ. 999తో రీఛార్జ్‌ చేసుకుంటే 150 ఎమ్‌బీపీఎస్‌తో కూడిన 2 టీబీ డేటాను పొందొచ్చు. అనంతరం 10 ఎమ్‌బీపీఎస్‌కి వేగం తగ్గుతుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు జియో స్టార్‌తో పాటు మరికొన్ని ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ ఉచితంగా పొందొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories