Fridge: గోడ నుంచి ఫ్రిజ్‌ ఎంత దూరంలో ఉండాలి? ఇలా చేస్తే సగం కరెంటు బిల్లు కూడా ఆదా..!

Fridge Distance From Wall Save Energy And Prevent Damage by Following These Simple Rules
x

Fridge: గోడ నుంచి ఫ్రిజ్‌ ఎంత దూరంలో ఉండాలి? ఇలా చేస్తే సగం కరెంటు బిల్లు కూడా ఆదా..!

Highlights

Fridge Distance From Wall: మన అందరి ఇళ్లలో ఫ్రిజ్‌ ఉంటుంది. ఈ బిజీ లైఫ్‌లో కూరగాయల నిల్వతోపాటు వండిన కూరలు, పాలు స్టోర్‌ చేసుకుంటాం. ఈ ఎండాకాలం మరింత ముఖ్యం.

Fridge Distance From Wall: రిఫ్రిజిరేటర్‌ అందరి ఇళ్లలో తప్పనిసరి అయింది. ఈ ఎండాకాలం కూరగాయలు, కూరలు, నీళ్లు, పాలు నిల్వ చేసుకుంటాం. అయితే, చాలా మందికి ఈ ఫ్రిజ్‌కు సంబంధించిన కొన్ని నియమాలు తెలియవు. తద్వారా కరెంటు బిల్లు పెరగడం లేదా ఫ్రిజ్‌ పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఫ్రిజ్‌ ఉన్న ప్రతిఒక్కరూ వాటి నియమాలు కూడా తెలుసుకుని ఉండండి.

ఇంటి స్థలాన్ని బట్టి కొంతమంది కిచెన్‌, హాల్‌లో ఫ్రిజ్‌ ను ఏర్పాటు చేసుకుంటారు. అయితే, ఫ్రిజ్‌ను ఒక గోడకు పెట్టేస్తే సరిపోదు ఇలా చేయడం వల్ల కరెంటు బిల్లు పెరిగిపోతుంది. ఒక్కోసారి అది పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఫ్రిజ్‌కు గోడకు మధ్య దూరం నిపుణుల అభిప్రాయం ప్రకారం కనీసం 6 అంగుళాలు ఉండాలి. అంటే ఇంటి గోడ నుంచి కనీసం ఫ్రిజ్‌ 15 సెంమీ దూరం ఉండాలి. ఎందుకంటే ఫ్రిజ్‌ శీతలీకరణ ప్రకియలో వెనుక గ్రిల్‌ నుంచి వేడి బయటకు వస్తుంది. అందుకే మరీ గోడకు ఆనుకుని ఉంటే ప్రమాదం. దీనివల్ల విద్యుత్‌ వినియోగం కూడా పెరుగుతుంది. ఫ్రిజ్‌ నుంచి వచ్చే కంపనాల వల్ల గోడ పక్కనే ఉంటే శబ్దం చేయడం కూడా ప్రారంభం అవుతుంది. అందుకే గోడ నుంచి ఫ్రిజ్‌ కాస్త దూరంగా పెట్టండి. ఇక ఫ్రిజ్‌ వేడిగా ఉండే వస్తువులు, ఎలక్ట్రానిక్‌ అప్లైయన్సస్‌ పక్కన పెట్టకండి. దీనివల్ల మరింత వేడి పెరుగుతుంది.

ఫ్రిజ్‌ డోర్‌ కూడా తరచూ తెరవకూడదు. తద్వారా ఫ్రిజ్‌ లోపలి భాగం మళ్లీ కూల్‌ అవ్వడానికి ఎక్కువ విద్యుత్‌ ఉపయోగించాల్సి వస్తుంది. మీ ఫ్రిజ్‌ వెనుక వెంటిలేషన్‌ ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోండి. దీనివల్ల ఫ్రిజ్‌ నుంచి విడుదలైన వాయువులు కూడా బయటకు వెళ్లిపోతాయి. కొంతమంది ఫ్రిజ్‌ను బెడ్‌రూమ్‌లో ఏర్పాటు చేసుకుంటారు. ఇది ప్రమాదకరం. అంతేకాదు దాని నుంచి వచ్చే శబ్దం వల్ల రాత్రి నిద్ర సమస్యలు కూడా వస్తాయి. ఇక ఎప్పటికప్పుడు ఫ్రిజ్‌, గ్రిల్స్‌, కాయిల్స్‌ శుభ్రం చేస్తూ ఉండాలి. దీనివల్ల లైఫ్‌ కూడా ఎక్కువ రోజులపాటు వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories