iPhone 16 Price Drop: ఐఫోన్ లవర్స్‌కు చక్కటి అవకాశం.. భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధర..!

iPhone 16 Price Drop: ఐఫోన్ లవర్స్‌కు చక్కటి అవకాశం.. భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధర..!
x
Highlights

iPhone 16 Price Drop: ప్రతి ఒక్కరూ ఐఫోన్ కొనాలని కోరుకుంటారు. అధిక ధర కారణంగా చాలా మంది ఈ ఫోన్ కొనలేరు.

iPhone 16 Price Drop: ప్రతి ఒక్కరూ ఐఫోన్ కొనాలని కోరుకుంటారు. అధిక ధర కారణంగా చాలా మంది ఈ ఫోన్ కొనలేరు. ఇలాంటి వారికి ఫ్లిప్‌కార్ట్ చక్కటి అవకాశం కల్పిస్తోంది. ఐఫోన్ 16 ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఎలాంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా ఈ ప్రీమియం ఐఫోన్‌పై రూ. 11,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

యాపిల్ తన ఐఫోన్ 16 సిరీస్‌ను గతేడాది విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 16ని రూ.79,900కి లాంచ్ చేసింది. కానీ, ప్రస్తుతం మీరు రూ.69,999కి కొనచ్చు. అంటే ఈ ఐఫోన్ పై దాదాపు రూ.10,000 డైరెక్ట్ డిస్కౌంట్ ఇస్తోంది. అంతేకాకుండా కూపన్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మీరు అదనంగా రూ.1,000 ఆదా చేసుకోవచ్చు. అంటే మీరు ఈ ఐఫోన్‌ను రూ.68,999కి ఆర్డర్ చేయచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్‌ల క్రింద అదనపు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లపై ఐఫోన్ ధర మరింత తగ్గనుంది. ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు.

iPhone 16 Features

ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్‌లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డైనమిక్ ఐలాండ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే గరిష్టంగా 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR10, డాల్బీ విజన్ సపోర్ట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది.మొబైల్ ఆపిల్ A18 బయోనిక్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 18తో పనిచేస్తుంది. ఫోన్‌లో మూడు స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ ఫోన్ బేస్ వేరియంట్ 128GB, టాప్ వేరియంట్ 512GB స్టోరేజ్‌తో వస్తుంది.

ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. 12-మెగాపిక్సెల్ 2X టెలిఫోటో లెన్స్‌ను కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. మొబైల్‌ని 3,561mAh కెపాసిటీ బ్యాటరీతో లాంచ్ చేశారు. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి USB టైప్-C పోర్ట్‌, 25W MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్, 15W Qi వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్స్ ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories