Samsung Galaxy S23 5G Discount: శాంం‌సంగ్ ఫోన్‌పై రూ. 45 వేల భారీ డిస్కౌంట్

Flipkart offers a Rs 45000 Discount on the Samsung Galaxy S23 5G
x

Samsung Galaxy S23 5G Discount: శాంం‌సంగ్ ఫోన్‌పై రూ. 45 వేల భారీ డిస్కౌంట్

Highlights

Samsung Galaxy S23 5G Discount: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్ ప్రీమియం ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది.

Samsung Galaxy S23 5G Discount: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్ ప్రీమియం ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు Samsung Galaxy S23 5G‌ను సగం ధరకే కొనవచ్చు. అంటే ఈ ఫోన్‌పై నేరుగా రూ. 45 వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ ఫోన్ ధరను గణనీయంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఫోన్‌పై ప్రత్యేక బ్యాంక్ , ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ S23 5G ఆఫర్

శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్‌ను 2023లో ఆ కంపెనీ రూ. 89,999కి విడుదల చేసింది. ఈ సిరీస్‌లో మూడు ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు ఈ సిరీస్ గెలాక్సీ S23 5G బేస్ వేరియంట్ ప్రస్తుతం రూ. 45 వేల తగ్గింపు తర్వాత రూ. 44,999కు మాత్రమే లభిస్తోంది. SBI క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్‌తో ఫోన్‌పై 10శాతం వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది.

ఫోన్‌‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు మీ పాత iPhone 11ని మార్చుకుంటే.. నేరుగా రూ. 14,450 వరకు ఆదా చేయవచ్చు. అయితే ఫోన్ ఎక్స్‌ఛేంజ్ వాల్యూ అనేది పాత ఫోన్ ఫర్ఫామెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఫోన్‌ మంచి వర్కింగ్ కండిషన్‌లో ఉంటే మీకు ఎక్స్‌చేంజ్ వ్యాల్యూ ఎక్కువగా వస్తుంది. లేదంటే మీకు వచ్చే ఎక్స్‌చేంజ్ బోనస్ తక్కువగా ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ S23 5G ఫీచర్స్

గెలాక్సీ S23 అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. ఫోన్‌ను వాటర్, డస్ట్ నుంచి ప్రొటక్ట్ చేయడానికి IP68 రేటింగ్ ఉంది. ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, 120Hz రిఫ్రెష్ రేట్, 1750 నిట్‌ల పీకచ్ బ్రైట్నెస్‌లో 6.1-అంగుళాల డైనమిక్ AMOLED స్క్రీన్‌ ఉంది. అలానే ఈ ఫోన్‌లో 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 3900mAh బ్యాటరీ ఉంది.

ఈ గెలాక్సీ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 8GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉంటుంది. కెమెరా విషయానికొస్తే... ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ, 10MP టెలిఫోటో, 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories