Motorola G04S: రూ. 7 వేలకే 50 ఎంపి కెమెరా.. మోటో ఫోన్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్..

Flipkart huge discount on Motorola G04S smartphone, check here for full details
x

Motorola G04S: రూ. 7 వేలకే 50 ఎంపి కెమెరా.. మోటో ఫోన్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్..

Highlights

Motorola G04S: రూ. 7 వేలకే 50 ఎంపి కెమెరా.. మోటో ఫోన్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్..

Motorola G04S: ఈ కామర్స్ సంస్థల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో. స్మార్ట్ ఫోన్ లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. సేల్స్ తో సంబంధం లేకుండా డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా కు చెందిన ఓ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఇంతకీ ఏంటా ఫోన్.? అందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మోటారోలాకు చెందిన Motorola G04S స్మార్ట్ఫోన్ పై ఫ్లిప్కార్ట్లో 30 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ రూ. 6,999కే లభిస్తోంది. అలాగే పలు బ్యాంక్ లకు చెందిన కార్డ్లతో కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ను మరింత తక్కువకు సొంతం చేసుకోవచ్చు.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.6 ఇంచెస్ తో కూడిన HD ప్లస్ IPS LCD డిస్ప్లేను ఇచ్చారు. ఈ ఫోన్ డిస్ప్లే 1612 x 720 పిక్సెల్స్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో తీసుకొచ్చారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్ యూనిసోక్ T606 SoC ప్రాసెసర్ తో పని చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS ఆధారంగా My UX ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ సౌండ్ని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ మంచి సౌండ్ అనుభూతిని అందిస్తుంది.

అలాగే ఇందులో దుమ్ము, స్ప్లాష్ రెసిస్టెంట్ కోసం IP52 రేటింగ్ను ఇచ్చారు. ఈ స్మార్ట్ఫోన్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ తో తీసుకొచ్చారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. 10 వాట్స్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories