Fipkart Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌.. ఐఫోన్ 16 ప్రో మాక్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్..!

Fipkart Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌.. ఐఫోన్ 16 ప్రో మాక్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్..!
x

Fipkart Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌.. ఐఫోన్ 16 ప్రో మాక్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్..!

Highlights

హాయ్ ఫ్రెండ్స్.. మీలో ఎవరైనా కొత్త ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఫ్లిప్‌కార్ట్ మీకో శుభవార్త చెప్పింది.

iPhone 16 Pro Max: హాయ్ ఫ్రెండ్స్.. మీలో ఎవరైనా కొత్త ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఫ్లిప్‌కార్ట్ మీకో శుభవార్త చెప్పింది. ఈ కామర్స్ సైట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో ఐఫోన్ 16 ప్రో మాక్స్‌పై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ సేల్‌లో ప్రో మాక్స్ మోడల్‌పై మాత్రమే కాకుండా అనేక ఇతర ఐఫోన్‌లపై కూడా తగ్గింపులు ఉన్నాయి. ప్రో మాక్స్ మోడల్ చాలా చీప్‌గా కొనుగోలు చేయచ్చు. ప్రస్తుతం ఈ ఐఫోన్‌ను దాని లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఫ్లాట్ డిస్కౌంట్‌లను అందిస్తోంది, దీని ద్వారా ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

యాపిల్ గత సంవత్సరం తన ఐఫోన్ 16 సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సిరీస్‌లో iPhone 16 Pro Max కూడా ఉంది. ఇది ఈ సిరీస్‌లో టాప్ మోడల్. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ని రూ.1,34,900కి లాంచ్ చేసింది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్ సేల్‌లో ఈ ఫోన్‌ను కేవలం రూ.1,14,999కి కొనుగోలు చేయచ్చు. ఫోన్‌పై రూ..19,901 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ పొందుతారు.

ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్‌పై కంపెనీ బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐ ఆప్షన్‌తో ఫోన్‌పై కంపెనీ రూ.2,500 వరకు డిస్కౌంట్ అందిస్తోంది, అయితే ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో రూ. 4,000 వరకు తగ్గింపును పొందచ్చు.

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్‌లో ప్రో మోడల్ కంటే పెద్ద డిస్‌ప్లే ఉంటుంది. మెరుగైన బ్యాటరీ లైఫ్ కూడా అందిస్తుంది. ఫోన్‌లో 6.9-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ A18 ప్రో చిప్‌సెట్, సిక్స్-కోర్ ప్రాసెసర్‌పై పనిచేసస్తుంది.

ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 48-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లేను కూడా ఉంది, ఇది సున్నితమైన స్క్రోలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు కూడా సపోర్ట్ ఇస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories