Motorola G05: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.6,999కే మోటో కొత్త స్మార్ట్‌ఫోన్..!

Motorola G05
x

Motorola G05: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.6,999కే మోటో కొత్త స్మార్ట్‌ఫోన్..!

Highlights

Motorola G05: మోటో మొబైల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 7,000 కంటే తక్కువ ధరకే కొనచ్చు.

Flipkart Bumper Offer: Motorola launches Moto G05 in India

Motorola G05: మోటో మొబైల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 7,000 కంటే తక్కువ ధరకే కొనచ్చు. దేశంలో ఇటీవల విడుదల చేసిన Motorola G05 స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ గతేడాది లాంచ్ అయిన Motorola G04 ఫోన్ సక్సెసర్. ఈ మొబైల్‌లో Moto G04 కంటే పెద్ద డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ కొత్త ధర, స్పెసిఫికేషన్‌లను తెలుసుకుందాం.


మోటరోలా G05 మొబైల్ 4GB + 64GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే విక్రయిస్తోంది. ఫోన్‌ను కేవలం రూ.6,999కే ఆర్డర్ చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ 30 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. కొన్ని బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ స్మార్ట్‌ఫోన్‌ను బుక్ చేస్తే.. మీకు 5శాతం అదనపు తగ్గింపు లభిస్తుంది. గ్రీన్, ప్లం రెడ్ కలర్స్‌లో ఫోన్‌ అందుబాటులో ఉంది.


స్మార్ట్‌ఫోన్‌లో పంచ్ హోల్ స్టైల్ IPS LCD , 6.67-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. డిస్ప్లే 1604 × 720 పిక్సెల్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. మొబైల్ మీడియాటెక్ Helio G81 అల్ట్రా ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం..ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆర్మ్ మాలి G52 MC2 GPU ఉంది. 4GB RAM + 8GB వర్చువల్ RAM, 64GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. మైక్రో SD ద్వారా స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు.


స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు. అందులో LED ఫ్లాష్‌తో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. మొబైల్‌లో 5,200mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫోన్‌ను వాటర్, డస్ట్ నుంచి ప్రొటక్ట్ చేయడానికి IP52 రేట్ చేశారు. అలానే డ్యూయల్ డాల్బీ అట్మోస్, స్టీరియో స్పీకర్లు, 3.5మిమీ ఆడియో జాక్ , సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.4, వై-ఫై, జిపిఎస్ ,యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories