Flipkart Big Billion Days Sale: వచ్చేసింది ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు చూస్తే మతి పోవాల్సిందే..!
Flipkart Big Billion Days Sale: స్టార్ట్‌ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు మొదలైన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలనుకునేవారికి ఇది శుభవార్తని చెప్పాలి.
Flipkart Big Billion Days Sale: స్టార్ట్‌ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు మొదలైన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలనుకునేవారికి ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ తన వార్షిక బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 8 నుంచి మొదలై అక్టోబర్ 15న ముగుస్తుంది. ఈ సేల్‌లో కస్టమర్లు ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ కార్డ్‌లపై 10% తక్షణ తగ్గింపును పొందుతారు. అదనంగా Paytm UPI Wallet ద్వారా ఎంపిక చేసిన ఉత్పత్తులపై డిస్కౌంట్లను పొందుతారు. .
Google Pixel 7 చౌక
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కొనుగోలుదారులు తమ పాత మొబైల్ పరికరాలను మంచి ధరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కంపెనీ ప్రకారం సేల్‌లో చాలా గొప్ప స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపులు ఉంటాయి. గూగుల్ పిక్సెల్ 7 రూ.59,999కి బదులుగా రూ.36,499కి అందుబాటులో ఉంది. ఇది కొత్త స్మార్ట్‌ఫోన్ కొనడానికి మంచి అవకాశంగా చెప్పవచ్చు.
ఈ ఫోన్లపై భారీ తగ్గింపు
Oppo Reno 10 Pro 5Gని రూ. 35,999, నథింగ్ ఫోన్ (2)ని రూ. 23,999, Samsung Galaxy F13ని రూ. 9,199కి కొనుగోలు చేయవచ్చు.ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో Poco M5, Redmi Note 12, Infinix Hot 30, Vivo V29e, Moto G32, Pixel 8, Pixel 8 Pro, Vivo V29 సిరీస్ వంటి అనేక స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లు, ఆఫర్‌లు ప్రకటించింది. .
టీవీలపై తగ్గింపు
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో టీవీలు, ఉపకరణాలపై భారీ తగ్గింపులు, ఆఫర్‌లు ఉంటాయి.ఏసీ ప్రారంభ ధర రూ.21,999, వాషింగ్ మెషీన్‌ను రూ.4,990 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఉపకరణాలు 50 నుంచి 80% వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది కస్టమర్లకు సువర్ణవకాశమని చెప్పవచ్చు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire