Vivo V30 Pro 5G: బెస్ట్ సెల్లింగ్ ఫోన్‌పై బెస్ట్ ఆఫర్.. 25% డిస్కౌంట్‌

Vivo V30 Pro 5G
x

వివో V30 ప్రో 5G మొబైల్

Highlights

Vivo V30 Pro 5G: దేశంలో వివో స్మార్ట్‌ఫోన్‌లకు బలమైన డిమాండ్ ఉంది. ఈ బ్రాండ్ నుంచి ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్ వస్తుందంటే మార్కెట్లో విపరీతమైన హైప్...

Vivo V30 Pro 5G: దేశంలో వివో స్మార్ట్‌ఫోన్‌లకు బలమైన డిమాండ్ ఉంది. ఈ బ్రాండ్ నుంచి ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్ వస్తుందంటే మార్కెట్లో విపరీతమైన హైప్ ఉంటుంది. ఎందుకంటే వివో తక్కువ బడ్జెట్‌లోనే బెస్ట్ కెమెరా ఫీచర్లను అందిస్తుంది. వివో V30 ప్రో 5G మొబైల్ కూడా అదేవిధంగా బెస్ట్ సెల్లింగ్ మొబైల్‌గా మార్కెట్లో దూసుకుపోతోంది. ఈ ఫోన్ వచ్చి ఏడాదైనా సేల్స్ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో వి30 ప్రోపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ప్రకటించింది.

వివో V30 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ని రూ. 41,999 ధరతో విదుదల చేసింది. మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్‌ రూ. 7,000 డిస్కౌంట్ ఇస్తోంది. ఇప్పుడు మీరు ఈ మొబైల్‌ను రూ.34,999కి ఆర్డర్ చేయవచ్చు. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 1,750 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఆమ్లోడ్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. డిస్ప్లే 1260 x 2800 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. మొబైల్ మీడియాటెక్ డైమెన్షన్ 8200 4nm ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GB RAM + 256GB, 12GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.

ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వాటిలో మొదటిది OISతో 50 MP మెయిన్ కెమెరా, సెకండరీ 50 MP అల్ట్రా-వైడ్ సెన్సార్, మూడవ కెమెరా 50MP 2x టెలిఫోటో పోర్ట్రెయిట్ లెన్స్‌ ఉన్నాయి. వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 50 MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

స్మార్ట్‌ఫోన్ 5000mAh కెపాసిటీ బ్యాటరీతో మార్కెట్లోకి విడుదలైంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందించారు. మొబైల్ కనెక్టివిటీలో 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-C, NFC ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories