Electric Flight: ఈ ఎలక్ట్రిక్ విమానంలో ప్రయాణించాలంటే ఖర్చు కేవలం రూ. 694

Electric Flight USA 130km 694 Rupees Beta Technologies Alia Cx300
x

Electric Flight: ఈ ఎలక్ట్రిక్ విమానంలో ప్రయాణించాలంటే ఖర్చు కేవలం రూ. 694

Highlights

Electric Flight: విమానయాన రంగంలో అమెరికా మరొక అడుగు ముందుకు వేసింది.

Electric Flight: విమానయాన రంగంలో అమెరికా మరొక అడుగు ముందుకు వేసింది. మొట్టమొదటిసారిగా పూర్తి ఎలక్ట్రిక్ విమానాన్ని తయారుచేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్యాసెంజర్లకు అనువుగా, సరసమైన విమానయాన్ని అందించాలని అమెరికా ఇప్పుడు ఒక కొత్త అడుగు వేసింది. మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ విమానాన్ని తయారుచేసింది. అయితే ఈ విమానం మామూలు విమానం కంటే చిన్నది. ఇందులో నలుగురు మాత్రమే ప్రయాణిస్తారు. ఒకసారి ఎగిరిన విమానం 130 కిమీ వరకు వేగంగా ప్రయాణిస్తుంది. అయితే దీనికి ఎంతో ఎక్కువ అవుతుందని మీరు అనుకునేరు. అసలు కాదు.. దీని ప్రయాణం ఖర్చు కేవలం రూ. 694లు. మీరు అసలు నమ్మడం లేదు కదా. కానీ ఇది నిజం. ఈ విమానం ఖర్చు జస్ట్ 8 డాలర్లు మాత్రమే ఉంటుంది.

బీటా టెక్నాలజీస్ దీన్ని సిద్దం చేసింది. దీనికి చెందిన అలియా CX300 విమానం నిర్వహించింది. ఇది ఈస్ట్ హాంఫ్టన్ నుంచి న్యూయార్క్‌లోని JFK విమానాశ్రయానికి కేవలం 30 నిమిషాల్లో ప్రయాణాన్ని కవర్ చేసింది. ఇది అమెరికా చరిత్రలో తొలిసారి కావడం విశేషం. ఇప్పటివరకు ఎటువంటి ఎలక్ట్రిక్ విమానం ప్రయాణికులను తీసుకెళ్లలేదు.

ఇంకా దీని ఖర్చుల గురించి చెప్పాలంటే ఈ విమానాన్ని ఛార్జ్ చేసి ఎగరడానికి కేవలం 694 రూపాయలు అవుతుంది. అయితే పైలెట్, విమానానికి అదనపు ఖర్చు ఉంటుంది. కానీ ఇది మొదట్లో సాంప్రదాయ విమానాల కంటే చాలా తక్కువ ఖర్చుతో ఉంటుంది. అంతేకాదు ఈ విమానం ఎక్కితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి శబ్దాలు ఉండవు. ప్రయాణికులు ఒకరికొకరు గుసగుసలు మాట్లాడినా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. వ్యాపారాల ప్రయాణాలకు, రోజు వారీ ప్రయాణాలను లక్ష్యంగా చేసుకునే ఈ విమానాన్ని తయారుచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories