Electric Vehicles: 2022లో మార్కెట్లో సందడి చేయనున్న ఎలక్ట్రిక్‌ బైక్‌లు, స్కూటర్లు ఇవే..!

Electric Bikes and Scooters That will make a Splash in the Market in 2022 | Technology News
x

Electric Vehicles: 2022లో మార్కెట్లో సందడి చేయనున్న ఎలక్ట్రిక్‌ బైక్‌లు, స్కూటర్లు ఇవే..!

Highlights

Electric Vehicles: ఇంధన రేట్లు పెరగడంతో వాహనదారులు ప్రత్యామ్నాయదారుల వైపు మళ్లుతున్నారు.

Electric Vehicles: ఇంధన రేట్లు పెరగడంతో వాహనదారులు ప్రత్యామ్నాయదారుల వైపు మళ్లుతున్నారు. అందులో వారికి కనిపించే దారి ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌. దీనికి తోడు పెరుగుతున్న కాలుష్యం వల్ల ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తూ ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే కొన్ని కంపెనీల ఎలక్ట్రిక్‌ బైక్‌లు, స్కూటర్లు విడుదలయ్యాయి. ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభంలో మరికొన్ని రాబోతున్నాయి. ఏది ఏమైనప్పటికి 2022 సంవత్సరంలో ఎలక్ట్రిక్‌ వాహనాల హవా నడుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి కొన్ని వాహనాల గురించి తెలుసుకుందాం.

1. Hero Electric AE-47

Hero Electric AE-47 బ్రాండ్ నుంచి మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విడుదల కాబోతుంది. ఈ బైక్‌ 85 kmph కంటే ఎక్కువ వేగంతో 4,000 W ఎలక్ట్రిక్ మోటార్‌తో శక్తిని పొందుతుంది. AE-47 తేలికపాటి పోర్టబుల్ లిథియం-అయాన్ 48V/3.5 kWh బ్యాటరీ ద్వారా నడుస్తుంది. నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. AE-47 రెండు మోడ్‌లను కలిగి ఉంటుంది.

2. సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SMIPL) సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వెర్షన్‌ను పరీక్షిస్తోంది. ఇది దాదాపు ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి ఈ స్కూటర్‌కి సంబంధించి ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు. అయితే ఇది దాదాపు 80 kmph గరిష్ట వేగం, 75 kmph కంటే ఎక్కువ పరిధి కలిగిన ఫీచర్-ప్యాక్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఉంటుందని అంచనా. ఈ స్కూటర్ 2022 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

3. Komaki రేంజర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

Komaki ఎలక్ట్రిక్ వెహికల్ తన మొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను జనవరి 2022లో విడుదల చేయనుంది. దీని 4 kWh బ్యాటరీ ప్యాక్ నుంచి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిమీల పరిధిని అందిస్తుంది. Komaki రేంజర్ 5,000W మోటార్‌తో వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇది చాలా మంచి పనితీరును కనబరుస్తుంది. ఇది కాకుండా Komaki రేంజర్ క్రూయిజ్ కంట్రోల్, రిపేర్ స్విచ్, రివర్స్ స్విచ్ అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో వస్తుంది.

4. కోమాకి వెనిస్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కొమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనుంది. దీనిని కొమాకి వెనిస్ అని పిలుస్తారు. వెనిస్ ఒక హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, 10 విభిన్న రంగులలో అందుబాటులో ఉంటుంది. సరసమైన ధరలలో లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories