Smartphone Heat: స్మార్ట్‌ఫోన్‌ అధికంగా వేడెక్కుతుందా.. ఎండాకాలం పేలిపోయే ప్రమాదం ఎక్కువ జాగ్రత్త..!

Does The Smartphone Heat Up Too Much Be Careful Of The Risk Of Exploding In Summer
x

Smartphone Heat: స్మార్ట్‌ఫోన్‌ అధికంగా వేడెక్కుతుందా.. ఎండాకాలం పేలిపోయే ప్రమాదం ఎక్కువ జాగ్రత్త..!

Highlights

Smartphone Heat: ఎండాకాలం వచ్చేసింది కాబట్టి వేడి అధికంగా ఉంటుంది.

Smartphone Heat: ఎండాకాలం వచ్చేసింది కాబట్టి వేడి అధికంగా ఉంటుంది. సహజంగానే ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ ఓవర్‌ హీట్‌ అవుతూ ఉంటాయి. అయితే ఇవి స్థాయికి మించి హీట్‌ అయితే పేలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు స్మార్ట్‌ఫోన్లు జేబులోనే బ్లాస్ట్‌ అవుతాయి. ఇలాంటి ఘటనలు కూడా చాలా జరిగాయి. అంతేకాదు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణు లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగిస్తున్నప్పు డు ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

ఎండాకాలం ఫోన్‌ను జేబులో పెట్టుకోవద్దు. దీనివల్ల ఫోన్‌ వేడేక్కే అవకాశం ఉంది. అలాగే ఫోన్‌కి ఎండ నేరుగా తగలకుండా చూసుకోవటం ముఖ్యం. లేదంటే ఫోన్ వేడెక్కి పాడవడమే కాకుండా పేలిపోయే ప్రమాదం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌పై కవర్‌ అనేది ఉండొద్దు. ఇది మరింత వేడిని ఆకర్షిస్తుంది. దీంతో ఫోన్ మరింత హీట్‌కు గురవుతుంది. ఫోన్ పేలడానికి బ్యాటరీ కూడా ఒక కారణం. ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్టడం వల్ల ఫోన్ బ్యాటరీపై ఎక్కువ భారం పపడుతుంది. ఆపై అధికంగా హీట్‌ అవుతుంది. ఈ పరిస్థితిలో ఫోన్ పేలిపోయే ప్రమాదం పెరుగుతుంది.

ముఖ్యంగా పాత స్మార్ట్‌ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తాజా ఫీచర్లతో కూడిన ఫోన్‌లు మంచి ప్రాసెసర్, బ్యాటరీతో వస్తున్నాయి. ఇలాంటి ఫోన్లు పగిలిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చాలా కంపెనీలు లిథియం-అయాన్ బ్యాటరీలతో ఫోన్‌లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి త్వరగా కరిగిపోయి పేలిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే ఫోన్‌ తీసుకునేటప్పుడు దాని సామర్థ్యం ఎంత ఉంది అనే వివరాలు పరిశీలించి మన్నికైన ఫోన్‌ తీసుకోవాలి. అప్పుడే అవి అన్ని పరిస్థితులకు తట్టుకుంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories