Smartphone Hanging: స్మార్ట్‌ఫోన్‌ అతిగా హ్యాంగ్‌ అవుతుందా.. ఈ కారణాలు తెలుసుకోండి..!

Does The Smartphone Hang Excessively Know These Reasons
x

Smartphone Hanging: స్మార్ట్‌ఫోన్‌ అతిగా హ్యాంగ్‌ అవుతుందా.. ఈ కారణాలు తెలుసుకోండి..!

Highlights

Smartphone Hanging: ఈ రోజుల్లోప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. దీనివల్ల అన్నిపనులు సులువుగా జరుగుతున్నాయి.

Smartphone Hanging: ఈ రోజుల్లోప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. దీనివల్ల అన్నిపనులు సులువుగా జరుగుతున్నాయి. చెల్లింపులు, బుకింగ్‌లు, సమాచారం ఇతరత్రా అన్ని విషయాలు నిమిషాల్లో జరుగుతున్నాయి. అయితే కొన్నిసార్లు ముఖ్యమైన పనిచేస్తున్నప్పుడు మధ్యలోనే హ్యాంగ్‌ అయిపోతుంది. దీనివల్ల చేసే పనులు సగంలోనే ఆగిపోతాయి. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తవానికి స్మార్ట్‌ఫోన్‌ హ్యాంగ్‌ ఎందుకవుతుంది.. దీనికి గల కారణాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మెమొరీ పూర్తి

మొబైల్ హ్యాంగింగ్‌కు అత్యంత సాధారణ కారణం ఫోన్ మెమరీ నిండిపోవడం. ఫోన్‌లో తక్కువ స్టోరేజ్ కారణంగా యాప్‌లను రన్ చేయడం, డేటాను ప్రాసెస్ చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.

యాప్‌లతో సమస్య

కొన్ని మొబైల్ యాప్‌లను సరిగా కోడ్ చేయరు. కొన్ని యాప్‌లలోని బగ్‌ల కారణంగా ఫోన్ హ్యాంగ్ అవుతుంది. మీ మొబైల్‌లో ఒక కొత్త యాప్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఫోన్ హ్యాంగ్ అవ్వడం మొదలైతే వెంటనే ఆ యాప్‌ను తొలగించండి.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో బగ్ కనిపించడం చాలా సార్లు జరుగుతుంది. దీని కారణంగా ఫోన్ హ్యాంగ్‌ అవుతుంది. ఇటీవల ఫోన్‌ను అప్‌డేట్ చేసి ఉంటే ఇది కూడా ఒక కారణం అవుతుంది.

హార్డ్వేర్ సమస్య

చాలా సార్లు సమస్య సాఫ్ట్‌వేర్‌లో కాదు హార్డ్‌వేర్‌లో కూడా ఉంటుంది. ఫోన్‌లో ఏ భాగంలో సమస్య వచ్చినా ఫోన్ హ్యాంగ్ అవుతుంది.

కాష్ ఫైళ్లు

మనం ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా ఫోన్ క్యాష్ ఫైల్స్ క్రియేట్ చేస్తాయి. అవి ఎక్కువవడం వల్ల ఫోన్ హ్యాంగ్ అవుతుంది.

ఇలాంటి సమస్యలను పరిష్కరించండి

మొబైల్ సెట్టింగ్‌లకు వెళ్లి అప్లికేషన్‌లకు వెళ్లి కాష్ ఫైల్‌లను క్లియర్ చేయండి. చాలా సార్లు ఫోన్‌లో బగ్ ఏర్పడిన తర్వాత డెవలపర్లు యాప్ కోసం కొత్త అప్‌డేట్‌ విడుదల చేస్తారు. ఈ పరిస్థితిలో ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌కి వెళ్లి యాప్‌కి అప్‌డేట్ ఉంటే అప్‌డేట్ చేయాలి. పైన పేర్కొన్న పద్ధతులు ఏవీ పని చేయకపోతే ఫోన్‌ని ఫ్యాక్టరీకి రీసెట్ చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories