Smartphone Cleaning Tips: స్మార్ట్‌ఫోన్‌ క్లీన్‌ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Do not make these Mistakes While Cleaning the Smartphone
x

Smartphone Cleaning Tips: స్మార్ట్‌ఫోన్‌ క్లీన్‌ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Highlights

Smartphone Cleaning Tips: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. అయితే దీనిని వాడటం తప్పించి దాని క్లీనింగ్‌ గురించి అస్సలు పట్టించుకోరు.

Smartphone Cleaning Tips: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. అయితే దీనిని వాడటం తప్పించి దాని క్లీనింగ్‌ గురించి అస్సలు పట్టించుకోరు. దీనివల్ల మీకు తెలియకుండానే మీ ఫోన్‌ పాడైపోతుంది. స్మార్ట్‌ఫోన్‌ క్లీనింగ్‌ అనేది చాలా ముఖ్యం. ఇంకొంత మంది అతి తెలివిగలవారు స్మార్ట్‌ఫోన్‌ను మెరిసేలా ఉంచడానికి అవసరమైన దానికంటే ఎక్కువ క్లీనింగ్ చేస్తారు. దీనివల్ల కూడా స్మార్ట్‌ఫోన్ పాడైపోతుంది. ఈరోజు చాలామంది స్మార్ట్‌ఫోన్‌ క్లీనింగ్‌లో చేసే తప్పుల గురించి తెలుసుకుందాం.

సాధారణ లిక్విడ్ ఉపయోగించవద్దు

కొంతమంది సాధారణ లిక్విడ్ క్లీనర్‌లను ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌లను శుభ్రం చేస్తారు. ఇలా ఎప్పుడు చేయకూడదు. సాధారణ లిక్విడ్ క్లీనర్ స్మార్ట్‌ఫోన్‌కి హాని కలిగిస్తుంది. ఎల్లప్పుడు ఆల్కహాల్ ఆధారిత క్లీనర్‌ను మాత్రమే ఉపయోగించాలి. దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు.

మైక్రోఫైబర్ క్లాత్‌ ఉపయోగించాలి

స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్‌ చేయడానికి సాధారణ వస్త్రాన్ని ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల ఫోన్ దెబ్బతింటుంది. డిస్‌ప్లే పాడవుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ మైక్రోఫైబర్ క్లాత్‌ను ఉపయోగించాలి. ఇది స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేకి హాని కలిగించకుండా శుభ్రపరుస్తుంది.

పదునైన వస్తువులు ఉపయోగించవద్దు

స్మార్ట్‌ఫోన్‌లోని ఆడియో జాక్ లేదా ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్‌ను క్లీన్ చేయాలనుకుంటే ఇందుకోసం పదునైన వస్తువులని ఉపయోగించకూడదు. ఎందుకంటే వీటివల్ల ఫోన్‌ భాగాలు ఘోరంగా దెబ్బతింటాయి. తర్వాత రిపేరు కోసం వేల రూపాయలు ఖర్చు చేయాలి.

హీటింగ్ బ్లోవర్‌ని ఉపయోగించవద్దు

కొంతమంది స్మార్ట్‌ఫోన్‌ని క్లీన్‌ చేయడానికి ఇంట్లో ఉన్న హీటింగ్ బ్లోవర్‌ని ఉపయోగిస్తారు. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ అంతర్గతంగా దెబ్బతింటుందని గుర్తుంచుకోండి. తర్వాత రిపేర్ చేయడానికి వేల రూపాయలు ఖర్చు చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories