Dizo Watch R: రూ.5 వేలలో బడ్జెట్ స్మార్ట్‌వాచ్.. ఫీచర్లలోనూ ది బెస్ట్..!

dizo watch r review
x

Dizo Watch R: రూ.5 వేలలో బడ్జెట్ స్మార్ట్‌వాచ్.. ఫీచర్లలోనూ ది బెస్ట్..!

Highlights

Dizo Watch R: ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే మోడ్, ప్రీమియం మెటల్ ఫ్రేమ్, 110+ స్పోర్ట్స్ మోడ్‌లు, ఆరోగ్యం, ఫిట్‌నెస్ మానిటరింగ్, 150+ వాచ్ ఫేస్‌లు, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 12 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ కీలక ఫీచర్లలో కొన్ని ముఖ్యమైనవి.

Dizo Watch R: రూ. 5,000 లోపు బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ల మార్కెట్ భారతదేశంలో అభివృద్ధి చెందుతోంది. ప్రతి ఒక్కరూ ఆపిల్ వాచ్ లేదా గెలాక్సీ వాచ్ లేదా ఫిట్‌బిట్‌ను కొనుగోలు చేయలేరు. వాటి ధరలు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది బడ్జెట్‌‌లో వచ్చే స్మార్ట్‌ వాచ్‌ల కోసం చూస్తుంటారు. వినియోగదారులను ఆకట్టుకోవాలంటే మాత్రం మంచి డిస్‌ప్లే, గొప్ప వాచ్‌ఫేస్‌తోపాటు నమ్మకమైన ఫిట్‌నెస్ ట్రాకింగ్ అవసరం. వీటన్నింటి సమ్మేళనంగా మార్కెట్‌లోకి విడుదలైన స్మార్ట్ ‌వాచ్ డిజో వాచ్ ఆర్. పూర్తి వివరాలను రివ్యూలో చూద్దాం.

రియల్‌మీ టెక్‌లైఫ్ బ్రాండ్‌లలో డిజో ఒకటి. Dizo Watch R ధర రూ. 3,999. AMOLED డిస్‌ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్, వాటర్ రెసిస్టెన్స్, ఫిట్‌నెస్ ట్రాకర్‌ సహా ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డిజో వాచ్ R మూడు అధునాతన రంగుల్లో లభిస్తుంది. క్లాసిక్ బ్లాక్, గోల్డెన్ పింక్, సిల్వర్ గ్రే రంగుల్లో లభిస్తుంది. అసలు ధర రూ. 3,999గా ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేక లాంచ్ ధర రూ. 3,499 ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

బడ్జెట్ గడియారాలు సాధారణంగా తక్కువ ఫీచర్లతో మార్కెట్‌‌లోకి విడుదలవుతాయి. కానీ, డిజో వాచ్ ఆర్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా మార్కెట్‌లోకి విడుదల అయింది. చేతికి ధరిస్తే మాత్రం ప్రీమియం వాచ్‌లానే కనిపిస్తుంది. బరువులో మాత్రం చాలా తేలికగా ఉండడం మరో ప్లస్ పాయింట్. ఈ వాచ్‌లో సిలికాన్ హ్యాండ్ పట్టీలు అందించారు. అయితే వీటిని మార్చుకునే ఛాన్స్ ఉంది. కుడివైపున ఉన్న రెండు బటన్‌లు నొక్కడంతో సులభంగా మార్చుకోవచ్చు.

1.3-అంగుళాల AMOLED డిస్ప్లే కూడా చాలా అందంగా ఉంది. వాచ్ బెజెల్స్‌లో సజావుగా మిళితం అవుతుంది. ఈ ప్యానెల్ నిజంగా ప్రకాశవంతంగా కనిపిస్తోంది. నలుపు రంగు వాచ్‌ఫేస్‌‌లో ఉన్నప్పుడు లేదా డిస్‌ప్లేలో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉన్నప్పుడు అద్భుతంగా కనిపిస్తుంది. ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే మోడ్, ప్రీమియం మెటల్ ఫ్రేమ్, 110+ స్పోర్ట్స్ మోడ్‌లు, ఆరోగ్యం, ఫిట్‌నెస్ మానిటరింగ్, 150+ వాచ్ ఫేస్‌లు, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 12 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ కీలక ఫీచర్లలో కొన్ని ముఖ్యమైనవి.

స్క్రీన్‌పై టచ్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. అలాగే డిజో వాచ్‌లో ఉన్న యూఐ చాలా సులభంగా, నావిగేట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది. వాచ్‌లో ప్రధాన యాప్ మెనూ కూడా ఆకట్టుకునే ఉంది. ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే (అనలాగ్, డిజిటల్) ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

సాఫ్ట్‌వేర్ వాచ్‌ఫేస్‌ను మార్చడం, బ్రైట్‌నెస్, వాచ్‌లోని యాప్‌ల మధ్య నావిగేషన్, కెమెరా షట్టర్, నోటిఫికేషన్ ట్యూనింగ్, ఫిట్‌నెస్ డేటాను యాప్‌కి లాగింగ్ వంటి ఇతర సెట్టింగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. యాప్‌లోని అన్ని ఫీచర్లు స్మూత్‌గా రన్ అవుతున్నాయి.

వాచ్‌ఫేస్‌లు కూడా బాగున్నాయి. ఇందులో మొత్తం 50 వాచ్‌ఫేస్‌లను ఇచ్చారు. కస్టమ్ వాచ్‌ఫేస్ మేకర్‌తో మీకు నచ్చిన ఫొటోలను ఉపయోగించి సరికొత్త వాచ్‌ఫేస్‌ని తయారుచేసుకోవచ్చు. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే వాటర్ రెసిస్టెన్స్, లిఫ్ట్-టు-వేక్ ఫీచర్, రెండూ బాగా పని చేస్తున్నాయి. వాచ్‌లో స్పీకర్ లేదు. ఇదొక్కటే ఇందులో మైనస్‌. ఇది బడ్జెట్ మోడల్‌గా విడుదలవ్వడంతో కొన్ని ఫీచర్లు లేవు.

వాచ్‌లో ఎడమ వైపున బటన్ ప్రెస్ చేస్తే నేరుగా వర్కౌట్ మెనుకి వెళ్తుంది. ఇక్కడ మీరు స్పోర్ట్స్ మోడ్‌లను యాక్సెస్ చేయవచ్చు. ఇందులో చాలా మోడ్స్‌ ఉన్నాయి. హార్ట్ రేట్‌ను కూడా తెలుసుకునే ఫీచర్ ఉంది. హృదయ స్పందన సెన్సార్, SpO2 సెన్సార్, స్టెప్ కౌంటర్‌లోని డేటా చాలా ఖచ్చితమైనది. కొన్ని బడ్జెట్ వాచ్‌లల్లో మాత్రం కౌంటింగ్ సమయంలో చాలా తేడాలు ఉన్నాయి. కానీ, డిజో వాచ్‌లో అలాంటి తేడాలు కనిపించలేదు.

చివరగా, వాచ్ యొక్క బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది. ఎల్లవేళలా డిస్‌ప్లేను ఆన్‌లో ఉంచి ఉపయోగించినా ఏడు రోజుల తరువాత 32 శాతం బ్యాటరీ మిగిలే ఉంది. అన్ని ఫీచర్లను కూడా కంటిన్యూస్‌గా ఉపయోగించినా ఎటువంటి సమస్య రాలేదు. ఆటోమేటిక్ హార్ట్ రేట్ ట్రాకింగ్, ఎల్లప్పుడూ ఆన్ డిస్‌ప్లే ఆఫ్ వంటి ఫీచర్‌లను ఆఫ్ చేయడంతో బ్యాటరీ లైఫ్ మరింత ఎక్కువగా వస్తుంది. పవర్ సేవ్ మోడ్ కూడా వాచ్‌లో ఉంది.

బడ్జెట్ ధరను పరిగణనలోకి తీసుకుంటే, Dizo Watch R చాలా బెస్ట్. అయితే ఇందులో వాచ్‌ఫేస్‌ని మార్చడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని ఇతర డిఫాల్ట్ ఎంపికల నుంచి కస్టమ్ వాచ్‌ఫేస్‌ను మాత్రమే వాచ్‌లో సేవ్ చేయగలగడం ఇందులో మైనస్‌. వాచ్‌ఫేస్‌లను మార్చాలంటే మాత్రం హోంకి రావాల్సి ఉంటుంది.

ఈ వాచ్‌లో నోటిఫికేషన్‌లను మాత్రమే చూడొచ్చు. వాటికి తిరిగి రిప్లై ఇవ్వలేం. రూ. 4,000 లేదా రూ. 5,000 లోపు ఉన్న బడ్జెట్ స్మార్ట్‌వాచ్ కోసం మీరు వెతుకుతున్నట్లయితే, డిజైన్, పనితీరు నాణ్యత లేదా ఫీచర్‌లను పరిగణిస్తే ఈ వాచ్ మీకు చాలా బెస్ట్. ఇందులో స్పీకర్‌ లేకపోవడంతో బ్లూటూత్ కాలింగ్ చేయలేం.Show Full Article
Print Article
Next Story
More Stories