CEIR Portal: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొంటున్నారా..? కొనే ముందు ఇలా తప్పక చెక్ చేసుకోండి

Department Of TeleCommunication Launched The CEIR Portal to Check Stolen and Original Smart Phone Status
x

సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొంటున్నారా..? అయితే ఇలా తప్పక చెక్ చేయండి

Highlights

CEIR Portal: కొత్త మొబైల్ ఫోన్స్ ని ఎక్కువ ధరకి కొనే బదులుగా సగం ధరకే లేదా అతి తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్ లేదా ఒకరు వాడిన మొబైల్ ని కొనాలనుకునే...

CEIR Portal: కొత్త మొబైల్ ఫోన్స్ ని ఎక్కువ ధరకి కొనే బదులుగా సగం ధరకే లేదా అతి తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్ లేదా ఒకరు వాడిన మొబైల్ ని కొనాలనుకునే వినియోగదారులు ఒకసారి ఆ మొబైల్ ఫోన్ దొంగిలించిందా లేదా అని తెలుసుకోని కొనుక్కోవడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో మంచిది. అలా మీరు కొనాలనుకున్న మొబైల్ ఫోన్ ఇలా చెక్ చేసుకొని కొనడం మంచిదని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఒక పోర్టల్ ని లాంచ్ చేసింది.

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) దొంగిలించబడిన, పోగొట్టుకున్న మొబైల్స్ ని ట్రాక్ చెయ్యడానికి సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) ని పోర్టల్ ని ఇటీవల లాంచ్ చేసింది. ఈ పోర్టల్ ద్వారా మీరు తీసుకోవాలనుకున్న ఫోన్ యొక్క వివరాలను ఈ విధంగా తెలుసుకోవచ్చు.

* CEIR పోర్టల్ లోకి వెళ్ళండి

* ఇక్కడ Main Page అప్లికేషన్ లోకి వెళ్ళండి.

* IMEI Verification అనే అప్షన్ ఎంచుకోండి.

* ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP పొందండి.

* మీకు పొందిన OTP ని ఎంటర్ చేయండి.

* ఆ తరువాత IMEI కోసం సూచించిన బాక్స్ లో IMEI నంబర్ ఎంటర్ చేయండి (IMEI నంబర్ తెలియకపోతే *#06# తో తెలుసుకోవచ్చు)

* మీరు IMEI ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఆ ఫోన్ కి సంబంధించిన వివరాలు అందించబడతాయి.

Click Here for Official Website: https://www.ceir.gov.in/Device/CeirIMEIVerification.jsp

Show Full Article
Print Article
Next Story
More Stories