CMF Phone 2 Pro Vs Realme P3 Lite 5G: సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో వర్సెస్ రియల్‌మీ పీ3 లైట్ 5G అదరహో..!

CMF Phone 2 Pro Vs Realme P3 Lite 5G: సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో వర్సెస్ రియల్‌మీ పీ3 లైట్ 5G అదరహో..!
x

CMF Phone 2 Pro Vs Realme P3 Lite 5G: సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో వర్సెస్ రియల్‌మీ పీ3 లైట్ 5G అదరహో..!

Highlights

CMF Phone 2 Pro Vs Realme P3 Lite 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం పోటీ ఆకాశాన్ని తాకుతోంది, ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్లో కంపెనీలు నువ్వా-నేనా అన్నట్లుగా ఫీచర్లను అందిస్తున్నాయి.

CMF Phone 2 Pro Vs Realme P3 Lite 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం పోటీ ఆకాశాన్ని తాకుతోంది, ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్లో కంపెనీలు నువ్వా-నేనా అన్నట్లుగా ఫీచర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలో CMF Phone 2 Pro , Realme P3 Lite 5G ఫోన్లు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తక్కువ ధరలో ప్రీమియం అనుభూతిని అందించడమే లక్ష్యంగా వచ్చిన ఈ మొబైల్స్, ప్రస్తుతం ఆన్‌లైన్ సేల్స్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. వాలెంటైన్స్ డే ఆఫర్లలో భాగంగా ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి, ఇది కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.

నథింగ్ సబ్-బ్రాండ్ అయిన CMF నుండి వచ్చిన Phone 2 Pro తన వినూత్నమైన డిజైన్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో 6.77 ఇంచుల Flexible AMOLED డిస్‌ప్లేను అమర్చారు, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3000 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది, దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో MediaTek Dimensity 7300 Pro 5G చిప్‌సెట్ ఉంది, ఇది మల్టీటాస్కింగ్, గేమింగ్‌కు అద్భుతంగా సహకరిస్తుంది. 50MP మెయిన్ కెమెరా , 50MP టెలిఫోటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఫోటోగ్రఫీ ప్రియులకు పండగలాంటి అనుభూతిని ఇస్తుంది.

మరోవైపు Realme P3 Lite 5G కేవలం రూ.10,499 ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఈ ఫోన్‌లో 6000mAh భారీ బ్యాటరీ ఉంది, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం విశేషం. మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉండటం వల్ల ఈ ఫోన్ చాలా ధృడంగా ఉంటుంది, పొరపాటున కింద పడినా త్వరగా పాడవదు. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ , 120Hz ఐ-కంఫర్ట్ డిస్‌ప్లే దీనికి మరిన్ని ప్లస్ పాయింట్లు.

ప్రస్తుతం Flipkart వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ఫోన్లపై క్రెడిట్ కార్డ్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు భారీగా లభిస్తున్నాయి. CMF Phone 2 Pro అసలు ధర రూ.18,999 అయినప్పటికీ, బ్యాంక్ ఆఫర్లతో దీనిని రూ.16,624 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే Realme P3 Lite 5G వేరియంట్లలో కొన్ని మోడల్స్ ఆఫర్ల తర్వాత కేవలం రూ.10,749 కే అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో 5G కనెక్టివిటీతో పాటు మెరుగైన డిస్‌ప్లే, బ్యాటరీ కావాలనుకునే వారికి Realme బెస్ట్ ఆప్షన్ కాగా, స్టైలిష్ లుక్, కెమెరా ముఖ్యం అనుకునే వారికి CMF ఫోన్ సరైన ఎంపిక.

Show Full Article
Print Article
Next Story
More Stories