CMF Phone 2 Pro: బొమ్మ పక్కా హిట్టు.. మార్కెట్లోకి CMF ఫోన్ 2 ప్రో.. కెమెరా ఫీచర్లు అదుర్స్..!

CMF Phone 2 Pro Launch April 28 Revealed Chipset and Camera Details
x

CMF Phone 2 Pro: బొమ్మ పక్కా హిట్టు.. మార్కెట్లోకి CMF ఫోన్ 2 ప్రో.. కెమెరా ఫీచర్లు అదుర్స్..!

Highlights

CMF Phone 2 Pro: నథింగ్ సబ్ బ్రాండ్ CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ లాంచ్ చేయడానికి ముందు, కంపెనీ దాని డిజైన్, చిప్‌సెట్, కెమెరా మాడ్యూల్‌ను టీజ్ చేసింది.

CMF Phone 2 Pro: నథింగ్ సబ్ బ్రాండ్ CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ లాంచ్ చేయడానికి ముందు, కంపెనీ దాని డిజైన్, చిప్‌సెట్, కెమెరా మాడ్యూల్‌ను టీజ్ చేసింది. ఈ నథింగ్ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 28న ఇండియాతో పాటు, ప్రపంచ మార్కెట్‌లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్‌తో పాటు ఆడియో ఉత్పత్తులను కూడా కంపెనీ విడుదల చేయనుంది. ఈ సీఎమ్ఎఫ్ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది, ఇది సీఎమ్ఎఫ్ ఫోన్ 1 తో పోలిస్తే పెద్ద అప్‌గ్రేడ్ అవుతుంది.

CMF Phone 2 Pro Camera

సీఎమ్ఎఫ్ ఫోన్ 2 ప్రో తాజా టీజర్‌లో కంపెనీ దాని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ గురించి సమాచారాన్ని పంచుకుంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెన్సార్లు ఉంటాయి. మూడవ కెమెరా సెన్సార్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో అందించారు. దీనితో పాటు సీఎమ్ఎఫ్ ఫోన్ 1లో అందించినట్లుగా ఫోన్ వెనుక ప్యానెల్‌లో రెండు స్క్రూలు కూడా కనిపిస్తాయి.సీఎమ్ఎఫ్ ఫోన్ 2 ప్రో కెమెరా స్పెక్స్‌ను కూడా కంపెనీ నిర్ధారించింది.

దీనికి 50MP ప్రైమరీ సెన్సార్ ఉంటుంది, దీని పరిమాణం 1/1.57-అంగుళాలు. ఈ ధర విభాగంలో ఇది అతిపెద్ద ఇమేజ్ సెన్సార్. దీనితో పాటు, ఈ ఫోన్‌లో 50MP 2x టెలిఫోటో లెన్స్ అందుబాటులో ఉంటుంది. ఈ టెలిఫోటో లెన్స్ కూడా ఈ విభాగంలో మొదటిసారిగా అందుబాటులో ఉంటుంది. మూడవ ఇమేజ్ సెన్సార్ గురించి చెప్పాలంటే, ఇది 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్. సీఎమ్ఎఫ్ ఫోన్ 1 లో, కంపెనీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ (50MP + 2MP) ఇచ్చింది. దీనితో పాటు, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.

CMF Phone 2 Pro Chipset

CMF ఫోన్ 2 ప్రో చిప్‌సెట్‌ను ధృవీకరిస్తూ.. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్‌ ఉంటుందని కంపెనీ తెలిపింది. గతంలో సీఎమ్ఎఫ్ ఫోన్ 1 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ అందించారు. కంపెనీ తన CPU పర్ఫామెన్స్ 10 శాతం, గ్రాఫిక్స్ పర్ఫామెన్స్ 5 శాతం మెరుగ్గా ఉందని పేర్కొంది. ఈ ఫోన్ 120fps వద్ద BGMI గేమింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

CMF Phone 2 Pro Price

టెక్ వర్గాల సమాచారం ప్రకారం.. నథింగ్ సబ్-బ్రాండ్ నుండి వచ్చిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్, 8జీబీ ర్యామ్‌తో రన్ అవుతుంది. ప్రస్తుతం, సీఎమ్ఎఫ్ ఫోన్ 2 ప్రో ధరకు సంబంధించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. అయితే సీఎమ్ఎఫ్ ఫోన్ 1 ను కంపెనీ రూ.15,999 ధరకు విడుదల చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories