Social Media: సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లపై కనకవర్షం కురిపించనున్న కేంద్ర ప్రభుత్వం

Social Media: సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లపై కనకవర్షం కురిపించనున్న కేంద్ర ప్రభుత్వం
x
Highlights

Social Media: ప్రస్తుతం ఇంటర్నెట్ యుగం నడుస్తోంది.లక్షలాది మంది యువత ఇప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ క్రియేషన్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు.

Social Media: ప్రస్తుతం ఇంటర్నెట్ యుగం నడుస్తోంది.లక్షలాది మంది యువత ఇప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ క్రియేషన్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. అలాగే చాలా మంది తమ కెరీర్ గా మలుచుకుంటున్నారు. అంతేకాకుండా బ్రాండ్‌లు, ఇండస్ట్రీలకు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి కంటెంట్ క్రియేటర్లను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక బిలియన్ డాలర్ల నిధిని ప్రారంభించినట్లు ప్రకటించింది.

వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ (WAVES) 2025 సందర్భంగా కేంద్ర సమాచార , ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిధిని ప్రకటించారు. ఈ నిధి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) కింద పనిచేస్తుంది. ఇది కంటెంట్ క్రియేటర్లకు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. దీంతో వారు ప్రపంచవ్యాప్తంగా వారి కంటెంట్‌ను చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది.

దీనితో పాటు రూ. 391 కోట్ల వ్యయంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ (ఐఐసిటి) స్థాపనకు కూడా ఆమోదం లభించింది. ఈ సంస్థ ముంబైలోని ఫిల్మ్ సిటీ, గోరేగావ్‌లోని ఐఐటి, ఐఐఎం తరహాలో స్థాపిస్తారు. ఇక్కడ కంటెంట్ క్రియేషన్, డిజిటల్ మీడియాకు సంబంధించిన ఉన్నత స్థాయి శిక్షణ ఇస్తారు.

భారతదేశ సృష్టికర్త ఆర్థిక వ్యవస్థ 30 బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఎదిగి దేశ జీడీపీకి సుమారు 2.5% దోహదపడుతుంది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీని విలువ రూ. 3,375 కోట్లకు చేరుకుంది. భారతదేశంలో 12% సృష్టికర్తలు నెలకు రూ. లక్ష నుండి రూ. 10 లక్షల మధ్య సంపాదిస్తున్నారు. 86% క్రియేటర్లు రాబోయే రెండేళ్లలో తమ ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నారు.

ప్రభుత్వం WAVES బజార్ అనే గ్లోబల్ ఈ-మార్కెట్‌ప్లేస్‌ను ప్రారంభించింది. ఇది ఇండియా కంటెంట్ క్రియేటర్లకను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానిస్తుంది. ఈ వేదిక సినిమా, టీవీ, గేమింగ్, సంగీతం, యానిమేషన్, ఇ-స్పోర్ట్స్ వంటి రంగాల నుండి కంటెంట్ సృష్టికర్తలకు ప్రపంచవ్యాప్త అవకాశాలను అందిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories