US to India iPhone: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెరికా నుంచి iPhone 17 తేవడం ఇక ఈజీ.. కేంద్రం బంపర్ ఆఫర్.!

US to India iPhone: కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల కోసం కస్టమ్స్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ తీపి కబురు అందించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Feb 2026 6:00 PM IST
US to India iPhone: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెరికా నుంచి iPhone 17 తేవడం ఇక ఈజీ.. కేంద్రం బంపర్ ఆఫర్.!
X

US to India iPhone: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెరికా నుంచి iPhone 17 తేవడం ఇక ఈజీ.. కేంద్రం బంపర్ ఆఫర్.!

US to India iPhone: కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల కోసం కస్టమ్స్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ తీపి కబురు అందించింది. 2026 కొత్త రూల్స్ ప్రకారం, విదేశాల నుంచి ముఖ్యంగా అమెరికా నుంచి భారత్‌కు వచ్చే వారు ఐఫోన్ 17 వంటి ఖరీదైన గ్యాడ్జెట్లను ఎటువంటి టెన్షన్ లేకుండా తీసుకురావచ్చు. ఈ నిర్ణయం విదేశీ ప్రయాణికులకు, టెక్ ప్రియులకు పెద్ద ఊరటనిస్తోంది.

తాజా నిబంధనల ప్రకారం, డ్యూటీ ఫ్రీ తీసుకురాగలిగే వస్తువుల పరిమితిని రూ.75,000 వరకు పెంచారు. గతంలో ఈ పరిమితి తక్కువగా ఉండటంతో ఖరీదైన ఫోన్లు తెచ్చినప్పుడు ఎయిర్‌పోర్టులో భారీగా కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిమితి పెరగడంతో, అమెరికాలో తక్కువ ధరకు లభించే ఐఫోన్‌లను కొనుగోలు చేసి భారత్‌కు తీసుకురావడం చాలా లాభదాయకంగా మారింది.

కేవలం స్మార్ట్‌ఫోన్లు మాత్రమే కాకుండా, ఒక ల్యాప్‌టాప్‌ను కూడా డ్యూటీ ఫ్రీగా భారత్‌కు తీసుకురావడానికి అనుమతి ఇచ్చారు. దీనివల్ల విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, ఐటీ ప్రొఫెషనల్స్ మరియు తరచుగా ప్రయాణించే పర్యాటకులకు భారీ ప్రయోజనం కలగనుంది. ప్రయాణికులు తమ వెంట తెచ్చుకునే వ్యక్తిగత వస్తువుల విషయంలో పారదర్శకత పెరగడం విశేషం.

సాధారణంగా అమెరికాలో ఐఫోన్ ధరలు భారత్‌తో పోలిస్తే రూ.30,000 నుండి రూ.40,000 వరకు తక్కువగా ఉంటాయి. గతంలో కస్టమ్స్ భయంతో చాలామంది ఫోన్లు తేవడానికి వెనకాడేవారు. కానీ ఇప్పుడు రూ.75 వేల వరకు మినహాయింపు ఉండటంతో, హై-ఎండ్ ఐఫోన్ 17 మోడళ్లను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా నేరుగా తీసుకురావచ్చు. ఇది ఎన్‌ఆర్‌ఐలకు, విదేశాల నుంచి గ్యాడ్జెట్లు తెప్పించుకునే వారికి డబుల్ బెనిఫిట్.

మొత్తానికి కేంద్ర ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ట్యాక్స్ చెల్లింపుల విషయంలో ప్రయాణికులకు చిక్కులు తగ్గడంతో పాటు, ప్రీమియం గ్యాడ్జెట్లను సులభంగా పొందే అవకాశం కలిగింది. ఇంకెందుకు ఆలస్యం, అమెరికా నుంచి వచ్చే మీ బంధువులకు ఇప్పుడే ఐఫోన్ 17 కోసం ఆర్డర్ ఇచ్చేయండి!

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story