BSNL Network: నెట్‌వర్క్ పెంచుకోవడానికి TCS తో చేతులు కలిపిన బీఎస్ఎన్ఎల్.. అదెలా?

BSNL partnered with TCS to bring 4G network across the country while Airtel and Jio already providing 5G network services
x

BSNL: యుద్ధం మొదలెట్టిన బీఎస్ఎన్ఎల్.. అయోమయంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు

Highlights

BSNL 5G Network: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం సంస్థ వేగంగా పని...

BSNL 5G Network: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం సంస్థ వేగంగా పని మొదలుపెట్టింది. భవిష్యత్తులో ఈ నెట్‌వర్క్‌ను 5Gకి అప్‌గ్రేడ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి, BSNL టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. BSNL 4G నెట్‌వర్క్ మే 2025 నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తుంది.

BSNL ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లను గుర్తించిన తర్వాత 5Gకి అప్‌గ్రేడ్ అవుతుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో TCS అడ్వైజర్‌గా పని చేస్తుంది. BSNL నెట్‌వర్క్‌లో TCS రేడియో డివైస్‌లను ఇన్‌స్టాల్ చేయాలని కంపెనీ భావిస్తోంది. తర్వాత సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ సహాయంతో 5Gకి మార్చవచ్చు.

BSNL కోర్ నెట్‌వర్క్‌ను సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DoT) సహాయంతో భారత ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ నెట్వర్క్ 5G నాన్-స్టాండలోన్ (NSA) మోడ్‌కు సపోర్ట్ ఇస్తుంది. BSNL కు 700 MHz, 900 MHz, 2100 MHz, 2500 MHz, 3500 MHz స్పెక్ట్రమ్ బ్యాండ్‌లలో లైసెన్స్‌ ఉంది. C-DoT, టాటా కంపెనీ తేజస్ నెట్‌వర్క్‌లు కలిసి దేశవ్యాప్తంగా 100,000 4G సైట్లను ఇన్‌స్టాల్ చేయాలనేది కంపెనీ ప్రణాళిక. ఇప్పటి వరకు BSNL 65,000 కంటే ఎక్కువ సైట్‌లను యాక్టివేట్ చేసింది.

టాటా సన్స్ కంపెనీ తేజస్ నెట్‌వర్క్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ప్రధాన టెలికాం సాధనాలను సిద్ధం చేస్తోంది. టవర్ల ఇన్‌స్టాలేషన్, ఆప్టిమైజేషన్ పనులు పూర్తయిన వెంటనే బీఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగిస్తామని తేజస్ నెట్‌వర్క్స్ చైర్మన్ సుబ్రమణియన్ తెలిపారు. కంపెనీ ఢిల్లీ సర్కిల్‌లో 1,876 సైట్‌లలో పని ప్రారంభించింది.

అంతేకాకుండా, భవిష్యత్తులో BSNL నుండి TCSకి మరిన్ని ఆర్డర్‌లు వస్తాయని భావిస్తున్నారు. జూన్ 2023లో, BSNL 100,000 సైట్‌లకు టెలికాం సాధనాలను సరఫరా చేయడానికి TCS, ప్రభుత్వ యాజమాన్యంలోని ITI లిమిటెడ్‌కు కాంట్రాక్ట్‌ను ఇచ్చింది.

1,00,000 సైట్‌ల ఇన్‌స్టాలేషన్‌తో దేశవ్యాప్తంగా BSNL కవరేజీని అందిస్తుందని ఆ సంస్థ ఛైర్మన్ చెప్పారు. అంతేకాకుండా సంస్థ సేవలను మరింత ఆధునికరించడానికి నిరంతరం కృషి చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో కంపెనీ 5G నెట్‌వర్క్-యాజ్-ఎ-సర్వీస్ (NaaS)ని కూడా అందిస్తుందని తెలిపారు. డిజిటల్ ఇండియా మిషన్ ఇది కూడా ఉపయోగపడుతుందన్నారు. అలానే మారుమూల ప్రాంతాలలో కూడా మెరుగైన నెట్‌వర్క్ కవరేజీ అందుబాటులో ఉంటుందని చెప్పారు.

బీఎస్ఎన్ఎల్, టాటా గ్రూప్ మధ్య భాగస్వామ్యం దేశంలోని జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ కంపెనీల సమస్యలను పెంచుతుంది. జియో, ఎయిర్టెల్ ఇప్పటికే 5G సేవలను అందించడం ప్రారంభించిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories