BSNL: బీఎస్ఎన్ఎల్ రూ.251 ఫుల్ పైసా వసూల్ ప్లాన్.. 251 జీబీ డేటా బంపర్‌ ప్లాన్..!

BSNL 251 GB Data Plan Best Value for Money With 251GB Data Full Details
x

BSNL: బీఎస్ఎన్ఎల్ రూ.251 ఫుల్ పైసా వసూల్ ప్లాన్.. 251 జీబీ డేటా బంపర్‌ ప్లాన్..!

Highlights

BSNL 251 GB Data Plan: భారత్ సంచార నిగమ్‌ లిమిటెడ్ (BSNL) ఈ ప్రభుత్వ రంగ దిగ్గజ కంపెనీ కొత్తగా రూ.251 ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఇందులో మీరు కళ్లు చెదిరే డేటా పొందుతారు. ఈ రూ.251 రీఛార్జ్ ప్లాన్ పూర్తి వివరాలు.

BSNL 251 GB Data Plan: భారత్ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్ (BSNL) ఫుల్ పైసా వసూల్ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ. 251 ప్లాన్‌తో 251 డేటా పొందుతారు. ఇందులో యూజర్లు కేవలం డేటా మాత్రమే పొందుతారు ఇతర ఏ సర్వీసులు అందుబాటులో లేవు. రూ.251 ప్లాన్ రీఛార్జీ ప్లాన్‌ డేటా ఎక్కువ వినియోగించే వారికి లేదా ఐపీఎల్ ప్రీమియర్ లీగ్స్ (IPL) వీక్షించే వారికి అద్భుతమైన ప్లాన్. ఈ డేటా రీఛార్జీ ప్యాక్‌కు సంబంధించి ఇతర వివరాలు తెలుసుకుందాం .

బీఎస్ఎన్ఎల్ 251 డేటా ప్లాన్ ..

భారత్ సంచార్‌ నిగం లిమిటెడ్ రూ.251 డేటా వోచర్‌తో 251gb డేటా పొందుతారు. ఇది ఫెయిర్‌ యూసేజ్ పాలసీ (FUP) డేటా అంటే బేస్ ప్లాన్ యాక్టివ్ గా ఉన్న యూజర్లు మాత్రమే ఈ ప్లాన్ యాడ్‌ ఆన్ చేసుకోవాలి. అంటే ఇప్పటికే యాక్టీవ్‌గా ఉన్న ప్లాన్ పై దీన్ని రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాక్ లో కేవలం 251 డేటా మాత్రమే పొందుతారు. ఇది 60 రోజుల పాటు వర్తిస్తుంది. ఇందులో ఇతర ఏ సర్వీసులు పొందలేరు.

అంటే ఇక్కడ కేవలం రూ.1 కే 1gb డేటా కస్టమర్లు పొందబోతున్నారు. అంటే ఇది అత్యంత తక్కువ ధరలో ఉన్న బీఎస్ఎన్ఎల్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ ఒక లక్షకు పైగా 4g సేవలను అందిస్తోంది. త్వరలో 5జీ టవర్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.

పెరిగిన టెలికాం ధరలు తర్వాత చాలామంది టెలికామ్ యూజర్లు బీఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ అయ్యారు. ప్రైవేట్ దిగ్గజ కంపెనీలు 25 శాతానికి పైగా రీఛార్జ్ ప్యాక్ లపై ధరలను పెంచేశాయి.ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ మాత్రం తమ ధరలను యథావిధిగా కొనసాగించింది.

ఈ నేపథ్యంలో 2024 అక్టోబర్ నెలలో వరకు బీఎస్ఎన్ఎల్ ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు పోర్ట్ అయ్యారు. ప్రస్తుతం బీఎస్‌ఎన్ఎల్‌ 4g సేవలను అందిస్తుంది. అతి త్వరలో 5జి సేవలను కూడా అందించే దిశగా అడుగులు వేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories