Mini Air Cooler: సమ్మర్‌లో కూలర్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 2వేలలో బెస్ట్‌ ఆప్షన్స్‌ ఇవే..!

Best Mini Air Coolers Under 2000 in Amazon
x

Mini Air Cooler: సమ్మర్‌లో కూలర్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 2వేలలో బెస్ట్‌ ఆప్షన్స్‌ ఇవే..!

Highlights

Mini Air Cooler: ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈసారి ఎండల తీవ్రత భారీగా ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు సైతం తెలిపారు.

Mini Air Cooler: ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈసారి ఎండల తీవ్రత భారీగా ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు సైతం తెలిపారు. దీంతో చాలా మంది కూలర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కూలర్‌ అనగానే భారీ ధర ఉంటుందనే అభిప్రాయం మనలో ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో కూడిన కొన్ని మినీ కూలర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఏంటా కూలర్స్‌, వాటిలో ఉన్న ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మినలీ కూలర్‌ ఫర్‌ రూమ్‌:

రూ. 2వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ఎయిర్‌ కూలర్స్‌లో ఇదీ ఒకటి. ఈ కూలర్‌ అసలు ధర రూ. 3,899గా ఉండగా ప్రస్తుతం అమెజాన్‌లో 59 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 1598కి లభిస్తోంది. యూఎస్‌బీ పోర్టు ద్వారా పనిచేసే ఈ కూలర్‌ పవర్ బ్యాంక్‌ సహాయంతో కూడా నడుస్తుంది. ఇందులోని ఎల్‌ఈడీ లైట్స్‌ రాత్రుళ్లు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. తక్కువ కరెంట్‌తో ఇది పనిచేస్తుంది.

పోర్టబుల్ మినీ ఎయిర్ కండిషనర్:

ఈ 500ML పోర్టబుల్ కూలర్ కూడా బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ కూలర్ ధర రూ. 1,999, కానీ 25% తగ్గింపు తర్వాత, మీరు దీన్ని రూ. 1,490కి సొంతం చేసుకోవచ్చు. పేరుకు తక్కువ ధరే అయినా మంచి ఫీచర్లను అందించారు. నీరు స్టోరేజ్‌తో వచ్చే ఈ కూలర్‌ చల్లటి గాలిని అందిస్తుంది. ఇది కూడా తక్కువ కరెంట్ వినియోగిస్తూ పని చేస్తుంది. ఈఎమ్‌ఐ ఆప్షన్‌ ద్వారా కూడా దీనిని సొంతం చేసుకోవచ్చు.

సింక్ ట్రేడర్స్-మినీ పోర్టబుల్ ఎయిర్ కూలర్:

మీరు ఈ కూలర్‌ను రూ. 2,499 కి కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన కూలర్స్‌లో ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ కూలర్‌తో 10 డేస్‌ రీప్లేస్‌ పాలసీని అందించారు. చిన్న సైజ్‌లో ఉండే ఈ కూలర్‌ను ఎక్కడికి అంటే అక్కడికి తీసుకొళ్లొచ్చు. అలాగే కూలింగ్ విషయంలో కూడా బాగుంటుంది. తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories