SIM Cards: జాగ్రత్త... మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులు ఉండకూడదు..ఇప్పుడే.. ఇలా చూసుకోండి

SIM Cards
x

SIM Cards: జాగ్రత్త... మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులు ఉండకూడదు..ఇప్పుడే.. ఇలా చూసుకోండి

Highlights

SIM Cards: చాలామంది చాలా తమ పేరుతో లెక్కలేనన్ని సిమ్ కార్డులు తీసేసుకుంటారు. మరికొందరైతే తమకే కాకుండా తమ బంధువులు, స్నేహితులకు కూడా తమ పేరతో సిమ్ కార్డులు కొని ఇచ్చేస్తుంటారు.

SIM Cards: చాలామంది చాలా తమ పేరుతో లెక్కలేనన్ని సిమ్ కార్డులు తీసేసుకుంటారు. మరికొందరైతే తమకే కాకుండా తమ బంధువులు, స్నేహితులకు కూడా తమ పేరతో సిమ్ కార్డులు కొని ఇచ్చేస్తుంటారు. అయితే ఒక మనిషికి తొమ్మది కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే మిగిలినవాటిని వెంటనే నిలిపివేయాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్‌ని తీసుకొచ్చింది.

గతంలో ఎప్పుడో తీసుకునే సిమ్ కార్డుల గురించి తెలియడం చాలాకష్టం. అలాగే అసలు ఎంతమందికి మీ పేరుపై సిమ్ కార్డులో ఇచ్చారో కూడా గుర్తుండటం కష్టమే. అంతేకాదు కొన్ని సిమ్‌లు వాడుకలో ఉండొచ్చు. ఉండకపోవచ్చు. అందుకే అలాంటివన్నీ మీరు ప్రభుత్వ సంచార్ సాతి వెబ్ సైట్‌లోకి ఇలా ప్రాసెస్‌ చేసి, మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసుకోండి. అంతేకాదు ఈ వెబ్ సైట్‌లో మీకు అవసరంలేని సిమ్ కార్డులను నిలిపి వేసే అవకాశం కూడా ఉంది.

గూగుల్ తెరిచి, అందులో https://sancharsaathi.gov.in/సంచార్ సాతి వెబ్ సైట్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత వెబ్ సైట్‌ లోపల సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ క్యాటగిరీలో ‘know your mobile connections’ అనే ఆప్ఫన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. ఈ సర్వీస్‌ను టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్జూమర్ ప్రోటెక్షన్ అందిస్తోంది. know your mobile connections’ పై క్లిక్ చేసిన తర్వాత ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో మీరు ప్రస్తుతం ఏ ఫోన్ నెంబర్ అయితే వాడుతున్నారో ఆ నెంబర్‌‌ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కింద ఉన్న క్యాప్చా కోడ్‌ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాలిడేట్ క్యాప్చా బటన్ ప్రెస్ చేయాలి.

అప్పుడు మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్‌‌కు వెరిఫికేషన్ కోడ్ ఒకటి వస్తుంది. దానిని కింద ఇచ్చిన బ్లాక్‌లో ఎంటర్ చేస్తే లాగిన్ అవుతారు. అప్పుడు మీ పేరుతో ఏ నంబర్లు రిజిస్టర్ అయ్యాయో వాటి వివరాలతో లిస్ట్ వస్తుంది.

ఇందులో మీకు అవసరం లేనివి, వద్దను కున్నవీ, వాడటం లేనివీ నిలిపివేయాలనుకుంటే పక్కనే ఉన్న ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిపై క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. చివరగా లాగ్ అవుట్ చేసి వెబ్ సైట్‌ను క్లోజ్ చేయాలి.

ఈ విధంగా చేయడం వల్ల మీరు అనవసరమైన నేరాల ఉచ్చులో పడకుండా ఉంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీ పేరుతో ఉన్న సిమ్‌ని ఎవరైనా వాడితే, వారు ఎలాంటి నేరాలు చేసినా, మీరు రిస్క్‌లో పడే ప్రమాదం ఉంది. అందుకే అవసరం లేని సిమ్ కార్డులను వెంటనే నిలిపి వేసుకోవడం చాలామంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories