New Sim Rules: మొబైల్‌లో రెండు సిమ్‌లు ఉన్నాయా.. ఇక బాదుడు షురూ..!

Are You Using Two SIMs In Your Mobile Recharge Prices Are Increasing Soon
x

New Sim Rules: మొబైల్‌లో రెండు సిమ్‌లు ఉన్నాయా.. ఇక బాదుడు షురూ..!

Highlights

New Sim Rules: నేటి రోజుల్లో చాలామంది స్మార్ట్‌ఫోన్‌లో రెండు సిమ్‌లను వాడుతున్నారు. ఒకటి ఇన్‌కమింగ్‌ అయితే మరొకటి అవుట్‌ గోయింగ్‌.

New Sim Rules: నేటి రోజుల్లో చాలామంది స్మార్ట్‌ఫోన్‌లో రెండు సిమ్‌లను వాడుతున్నారు. ఒకటి ఇన్‌కమింగ్‌ అయితే మరొకటి అవుట్‌ గోయింగ్‌. లేదంటే ఒక నెంబర్‌ జాబ్‌కోసం, మరొక నెంబర్‌ పర్సనల్‌ అవసరాల కోసం వాడుతున్నారు. దాదాపు చాలామంది ఇదే పద్దతి కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక నుంచి ఈ పద్దతి కష్టమవుతుంది. ఎందుకంటే టెలికాం కంపెనీలు టారిఫ్ ప్లాన్‌ల ధరలు పెంచబోతున్నాయి. 2021డిసెంబర్లో చివరిసారిగా టారిఫ్ ప్లాన్ ధర పెంచారు. ఇప్పుడు రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ వాటిని సవరించడానికి సిద్దమవుతున్నా రు. దీనివల్ల పరిస్థితి ఏ విధంగా మారుతుందో ఈ రోజు తెలుసుకుందాం.

టెలికాం కంపెనీలు ధరలు పెంచడం వల్ల రెండు సిమ్ లు వాడేవారు చాలా ఇబ్బందిపడుతారు. ఎందుకంటే రెండో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా సిమ్‌లను యాక్టివ్‌గా ఉంచడానికి కనీసం రూ. 150 రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టారిఫ్ పెరిగితే రూ. 150కి బదులుగా . 180 నుంచి రూ. 200 వరకూ చెల్లించవలసి ఉంటుంది. మీరు రెండు సిమ్‌లను ఉపయోగిస్తే కనీసం 28 రోజులకు రూ. 400 రీచార్జ్ చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి.

మీరు నెలవారీ రూ. 300 రీఛార్జ్ చేసుకుంటే టారిఫ్ పెరిగిన తర్వాత నెలకు రూ. 75 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ రూ.500 రీఛార్జ్ చేసుకుంటే రూ.125 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ త్వరలో 5జీ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించవచ్చు. ఇది ప్రస్తుతానికి పూర్తిగా ఉచితం. మీరు ఒక సిమ్ 5జీ, మరో సిమ్ 4జీని వాడినట్లయితే నెలవారీ ఖర్చు దాదాపు 50 శాతం పెరుగుతుంది. ఎందుకంటే 5జీ ప్లాన్ ధర 4జీ కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే 4జీ ప్లాన్ ధరను కూడా పెంచుతున్నారు. దీంతో సామాన్యుల పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories