Water Heater: వాటర్​ హీటర్​ వాడుతున్నారా.. ఈ విషయాలు ఎప్పుడైనా గమనించారా..!

Are you using a water heater If you dont pay attention to these things you will get an Electric Shock
x

Water Heater: వాటర్​ హీటర్​ వాడుతున్నారా.. ఈ విషయాలు ఎప్పుడైనా గమనించారా..!

Highlights

Water Heater: చలికాలం ప్రారంభమైంది. దీంతో ఉదయం చన్నీళ్లను చూస్తే వణుకొస్తుంటుంది. ఈ సమయంలో చాలామంది వేడినీళ్ల కోసం తపిస్తుంటారు.

Water Heater: చలికాలం ప్రారంభమైంది. దీంతో ఉదయం చన్నీళ్లను చూస్తే వణుకొస్తుంటుంది. ఈ సమయంలో చాలామంది వేడినీళ్ల కోసం తపిస్తుంటారు. డబ్బులున్నవారు గీజర్లను అమర్చుకుంటే లేనివాళ్లు వాటర్​ హీటర్లను ఉపయోగిస్తారు. అయితే హీటర్​ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.ఇది చాలా ప్రమాదంతో కూడుకొన్నది. ఏమరపాటుగా ఉన్నా చిన్న పొరపాటు జరిగినా ఎలక్ట్రిక్​ షాక్​ కి గురికావాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మరణం సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిని వాడేటప్పుడు జాగ్రత్తల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

వాటర్ హీటర్ రాడ్లు చాలా కాలం పాటు పనిచేస్తాయి. సాధారణంగా ఎటువంటి సమస్య లేకుండా 5 సంవత్సరాల వరకు కొనసాగుతాయి. అయితే 2 సంవత్సరాల తర్వాత వాటర్ హీటర్ రాడ్‌ని ఉపయోగించడం వల్ల ప్రమాదం నెలకొని ఉంది. ఇది విద్యుత్ షాక్‌కు కారణం అవుతుంది. డబ్బు ఆదా చేయడానికి ప్రజలు స్థానిక వాటర్ హీటర్లను కొనుగోలు చేస్తారు. కానీ అది కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడతుంది. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ కాకుండా ఒరిజినల్ కొనాలని నిపుణులు సూచిస్తున్నారు.

వాటర్​ హీటర్​ను తప్పుగా ఉపయోగించకూడదు. రాడ్‌ని బకెట్‌లో పెట్టిన తర్వాతే ఆన్ చేయాలి. ముందుగా స్విచ్​ ఆన్​ చేస్తే కరెంటు షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. వాటర్ హీటర్ రాడ్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. నీటిలో ఉన్నప్పుడు రాడ్ దెబ్బతింటుంది. మురికి పేరుకుపోవడం వల్ల నీరు ఆలస్యంగా వేడెక్కుతుంది. ఈ పరిస్థితిలో ఎప్పటికప్పుడు శుభ్రపరచడం అవసరం. ఇనుప బకెట్లలో ఎలక్ట్రిక్ రాడ్లు వాడకూడదు. ఇలా చేయడం వల్ల విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇందుకోసం ప్లాస్టిక్ బకెట్లే బెస్ట్​ అని చెప్పొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories