Buying Second Hand IPhone: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా.. వీటిని గమనించకుంటే నష్టపోతారు..!

Are you buying a second hand iPhone check these things or else you will lose
x

Buying Second Hand IPhone: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా.. వీటిని గమనించకుంటే నష్టపోతారు..!

Highlights

Buying Second Hand IPhone: చాలామందికి ఐఫోన్‌ కొనాలనే కోరిక ఉంటుంది. కానీ బడ్జెట్‌ సరిపోక ఊరుకుంటారు. మరికొంతమంది సెకండ్‌ హ్యాండ్‌ ఐ ఫోన్‌ కొనడానికి మొగ్గు చూపుతారు.

Buying Second Hand IPhone: చాలామందికి ఐఫోన్‌ కొనాలనే కోరిక ఉంటుంది. కానీ బడ్జెట్‌ సరిపోక ఊరుకుంటారు. మరికొంతమంది సెకండ్‌ హ్యాండ్‌ ఐ ఫోన్‌ కొనడానికి మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఇది తక్కువ ధరలో లభిస్తుంది. కానీ ఇందులో కొన్ని మోసాలు దాగి ఉంటాయి. వాటిని గమనించకుంటే తీవ్రంగా నష్టపోతారు. సెకండ్‌ హ్యాండ్ ఐ ఫోన్‌ కొనడానికి ముందు కొన్ని విషయాలను గమనించాలి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

ఐఫోన్‌ కొనుగోలు స్లిప్‌ ని అడగండి

మీరు సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ను కొనుగోలు చేస్తుంటే ముందుగా వారి దగ్గరి నుంచి ఐఫోన్‌ కొనుగోలు స్లిప్‌ని అడగండి. ఒరిజినల్ రశీదు హార్డ్ కాపీ లేదా సాఫ్ట్ కాపీ అయినా సరిపోతుంది. నిజానికి ఫోన్ పాతది అయినప్పటికీ చాలా సార్లు వారెంటీ ఉంటుంది. ఫోన్ అసలు రశీదును పొందినట్లయితే దాని నుంచి ఫోన్ వారంటీ వివరాలు తెలుసుకోవచ్చు.

క్రమ సంఖ్యను చెక్‌ చేయండి

వారంటీని వెరిఫై చేసేందుకు ముందుగా ఐఫోన్ సెట్టింగ్స్ కి వెళ్లి జనరల్ ఆప్షన్ లోకి వెళ్లి అబౌట్ సెక్షన్ పై క్లిక్ చేయండి. దీనివల్ల ఐఫోన్‌ క్రమ సంఖ్యను చెక్‌ చేయవచ్చు. ఈ క్రమ సంఖ్యను కాపీ చేసి checkcoverage.apple.comలో నమోదు చేసి అన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

బ్యాటరీ చెక్‌ చేయండి

సెకండ్‌ హ్యాండ్‌ ఐఫోన్‌ కొనేముందు దాని బ్యాటరీని చెక్‌ చేయాలి. ఐఫోన్ బ్యాటరీ 80 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఆ ఫోన్‌ని కొనుగోలు చేయడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు కానీ ఇంతకంటే తక్కువగా ఉంటే మాత్రం ఆలోచించాలి. ఐఫోన్ బ్యాటరీ చెక్ చేయడానికి ఐఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి బ్యాటరీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. బ్యాటరీ కెపాసిటీ, ఛార్జింగ్ వివరాలు తెలుస్తాయి.

ఫోన్‌ సమాచారం తెలుసుకోండి

ఐఫోన్‌ రిపేర్‌కు వెళ్లిందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఐఫోన్‌ సెట్టింగ్‌లకు వెళ్లి, డిస్‌ప్లే, బ్రైట్‌నెస్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ట్రూ టోన్‌ని యాక్టివేట్ చేయాలి. ఒకవేళ మీరు దీన్ని యాక్టివేట్ చేయలేకపోతే ఈ ఫోన్‌ రిపేర్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories