iPhone 18: యాపిల్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఈ ఏడాది ఐఫోన్ 18 కష్టమే..!

iPhone 18: యాపిల్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఈ ఏడాది ఐఫోన్ 18 కష్టమే..!
x

iPhone 18: యాపిల్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఈ ఏడాది ఐఫోన్ 18 కష్టమే..!

Highlights

ప్రముఖ అమెరిక టెక్ దిగ్గజం యాపిల్ బ్రాండ్లపై వినియోగదారుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

iPhone 18: ప్రముఖ అమెరిక టెక్ దిగ్గజం యాపిల్ బ్రాండ్లపై వినియోగదారుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానికి తగ్గట్టే ప్రతిఏటా యాపిల్ కూడా తమ సరికొత్త గ్యాడ్జెట్స్ ద్వారా యూజర్లను ఆకట్టుకుంటోంది. 2025లో యాపిల్ 17 సిరీస్‌లు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజా నివేదిక యాపిల్ లవర్స్‌ను నిరాశ పరిచింది. ఈ ఏడాది iPhone 18 విడుదలయ్యే అవకాశం లేదని, యాపిల్ తన సంప్రదాయ విడుదల షెడ్యూల్‌లో పెద్ద మార్పులు చేయబోతున్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది.

ప్రతి ఏటా సెప్టెంబరులో కొత్త ఐఫోన్‌ను ఆవిష్కరిస్తూ వచ్చిన యాపిల్.. ఇప్పుడు తన సంప్రదాయ విధానానికి బ్రేక్ వేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఐఫోన్ 18 2026లో లాంచ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. యాపిల్ అభిమానులకు ఇది నిజంగా చేదు వార్తే మరి. ఇటీవలే 2026 సెప్టెంబరులో Apple iPhone 18 లాంచ్ కావచ్చని పుకార్లు గట్టిగానే వినిపించాయి. అయితే తాజా MacRumors నివేదిక ప్రకారం.. యాపిల్ బేస్ ఐఫోన్ 18ను మరింత ఆలస్యం చేసి 2027 వసంతకాలానికి వాయిదా వేసే అవకాశముంది. అలా జరిగితే.. ప్రస్తుతం రానున్న iPhone 17 నాన్-ప్రో మోడల్ దాదాపు 18 నెలలకు పైగా మార్కెట్‌లో కొనసాగనుంది.

=

యాపిల్ ఇకపై ఒకేసారి అన్ని ఐఫోన్ మోడళ్లను విడుదల చేయకుండా.. స్టాగర్డ్ లాంచ్ ప్లాన్ (అన్నింటినీ ఒకేసారి కాకుండా, విడతల వారీగా లేదా వేర్వేరు సమయాల్లో దశల వారీగా) విడుదల చేసే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది. 2026 వసంత కాలంలో iPhone 18 Pro, iPhone 18 Pro Max, అలాగే యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్‌గా భావిస్తున్న iPhone Fold విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 2027 వసంతకాలంలో iPhone 18, iPhone 18e, అలాగే కొత్త తరం iPhone Air మార్కెట్‌లోకి రావచ్చని నెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే iPhone 16e, iPhone Air వంటి కొత్త మోడళ్లతో యాపిల్ తన iPhone పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. ఈ వ్యూహంతో ఏడాది పొడవునా లాంచ్‌లు ఉండటమే కాకుండా.. సరఫరా నెట్‌వర్క్‌పై ఒత్తిడి తగ్గడం, ఆదాయం సమతుల్యంగా రావడం వంటి లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు వెలువడ్డ సమాచారం గురించి యాపిల్ నుంచి ఎలాంటి అధికారిక నివేదికలు లేవు. కాబట్టి.. సంస్థ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు.. ఈ వార్తలను కాస్త జాగ్రత్తగా గమనించాల్సిందే. ఎందుకంటే.. టెక్ ప్రపంచంలో ఏ మలుపు ఎప్పుడు తిరుగుతుందో చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories