
Apple iPhone 18 Air: ఐఫోన్ 18 ఎయిర్.. చాలా సన్నగా ఉంటుంది.. లాంచ్ ఎప్పుడుంటే..?
ఆపిల్ ఐఫోన్ 18 ఎయిర్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని ఆసక్తిగా చూస్తున్న ఒక డివైస్‌గా మారింది.
Apple iPhone 18 Air: ఆపిల్ ఐఫోన్ 18 ఎయిర్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని ఆసక్తిగా చూస్తున్న ఒక డివైస్‌గా మారింది. ఇప్పటివరకు ఆపిల్ విడుదల చేసిన ఐపోన్లలో డిజైన్ పరంగా పెద్ద మార్పులు చాలా అరుదుగా వచ్చాయి. కానీ ఐఫోన్ 18 ఎయిర్ విషయంలో మాత్రం సన్నగా, తేలికగా, రోజువారీ ఉపయోగానికి సరిపడేలా అన్న ఆలోచన పూర్తిగా ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. హైఎండ్ ప్రో మోడల్స్‌లా ఎక్కువ హార్డ్‌వేర్ చూపించకుండా, యూజర్‌కు కంఫర్ట్ ఇచ్చే ఫోన్ తయారు చేయాలనే దిశగా ఆపిల్ అడుగు వేస్తున్నట్టు ఈ లీక్‌లు సూచిస్తున్నాయి.
ఆపిల్ ప్రొడక్ట్స్‌లో “ఎయిర్” అనే పదం ఎప్పుడూ ఒక ప్రత్యేక అర్థం ఇస్తుంది. మ్యాక్‌బుక్ ఎయిర్ వచ్చినప్పుడు బరువు తగ్గింది, డిజైన్ సన్నబడింది, రోజువారీ పనులకు సరిపడే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అదే ఫార్ములా ఐప్యాడ్ ఎయిర్‌లో కూడా చూశాం. ఇప్పుడు అదే ఎయిర్ ఫిలాసఫీని ఐఫోన్‌కి తీసుకురావడం అంటే, భారీ స్పెసిఫికేషన్స్ కన్నా డిజైన్ అనుభవాన్ని ముందుకు పెట్టడం అనే అర్థం. ఐఫోన్ 18 ఎయిర్ స్టాండర్డ్ మోడల్ కంటే ప్రీమియమ్గా కనిపించాలి, ప్రో మోడల్లా క్లిష్టంగా ఉండకూడదు అనే స్టాండర్డ్ మోడల్ ప్రో మోడల్ మధ్యలో ఉండే స్థానం ఈ ఫోన్‌కు ఇవ్వాలని ఆపిల్ ప్లాన్ చేస్తోంది అని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
లీక్‌ల ప్రకారం ఐఫోన్ 18 ఎయిర్, ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్లలోనే అత్యంత సన్నని డిజైన్‌తో రావొచ్చు. ఈ సన్నదనం కేవలం లుక్ కోసం కాదు, రోజంతా చేతిలో ఫోన్ వాడే యూజర్లకు కంఫర్ట్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆపిల్ ఇందులో కొత్త మెటీరియల్స్ ఉపయోగించి ఇంటర్నల్ పార్ట్స్‌ను రీడిజైన్ చేసిందని సమాచారం. ఫోన్ చేతిలో పట్టుకుంటే బరువు తక్కువగా అనిపించేలా డిజైన్ ఉండబోతుంది. జేబులో పెట్టుకున్నప్పుడు బల్క్ ఫీలింగ్ లేకుండా ఉండేలా కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఫ్లాట్ ఎడ్జెస్, సాఫ్ట్ కర్వ్స్, రిఫైన్డ్ ఫినిష్‌తో ఈ ఫోన్ చూడటానికి చాలా క్లీన్‌గా ఉండే అవకాశం ఉంది. బేజెల్స్ మరింత తగ్గితే, స్క్రీన్ చూడటంలో చూపు అంతా అదే మీద నిలిచిపోయేలా అనుభవం మారుతుంది.
ఐఫోన్ 18 ఎయిర్‌లో ట్రిపుల్ కెమెరా కాకుండా డ్యువల్ కెమెరా సెటప్ కనిపించబోతుందని లీక్‌లు చెబుతున్నాయి. ఇందులో ఒక మెయిన్ వైడ్ సెన్సార్ ఉంటుంది, మరో అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటుంది. ప్రతి యూజర్‌కు టెలిఫోటో అవసరం ఉండదు అనే విషయాన్ని ఆపిల్ బాగా అర్థం చేసుకున్నట్టు ఈ నిర్ణయం చెబుతోంది. రోజువారీ ఫోటోలు, ట్రావెల్ షాట్స్, ఫ్యామిలీ ఫోటోలు, సోషల్ మీడియా కోసం ఈ డబుల్ కెమెరా సెటప్ సరిపోతుందని ఆపిల్ భావిస్తోంది.
హార్డ్‌వేర్ పరంగా ప్రో మోడల్‌లతో పోలిస్తే కెమెరా కొంచెం తక్కువగా ఉన్నా, ఆపిల్ అసలు బలం సాఫ్ట్వేర్ అనే విషయం తెలిసిందే. ఐపోన్ 18 ఎయిర్‌లో కొత్త ఇమేజ్ ప్రాసెసింగ్ విధానాలు ఉండే అవకాశం ఉంది. స్మార్ట్ హెచ్‌డిఆర్ మరింత మెరుగుపడుతుంది, నైట్ మోడ్ క్లారిటీ పెరుగుతుంది, ఏఐ ఆధారిత సీన్ డిటెక్షన్ వల్ల ఫోటోలు ఆటోమేటిక్‌గా బాగా ట్యూన్ అవుతాయి. యూజర్ ఎక్కువగా సెట్టింగ్స్ మార్చకుండా కూడా మంచి ఫోటో రావాలనే ఆలోచన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.
ఐఫోన్ 18 ఎయిర్ డిస్ప్లే విషయంలో ఆపిల్ చాలా బ్యాలెన్స్ ప్లాన్ చేస్తోంది. ప్రో మోడల్లా అత్యధిక రిఫ్రెష్ రేట్స్ ఉండకపోయినా, కలర్ అక్యురసీ, బ్రైట్నెస్, షార్ప్‌నెస్ విషయంలో మాత్రం ఎలాంటి లోటు లేకుండా చూస్తారని సమాచారం. ఈ డిస్ప్లే రోజువారీ బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్, రీడింగ్ లాంటి పనులకు చాలా సూటబుల్‌గా ఉంటుంది. బ్యాటరీ వినియోగం నియంత్రణపై ఎక్కువ దృష్టి పెట్టి, స్క్రీన్ ద్వారా జరిగే విద్యుత్ ఖర్చు తగ్గేలా డిస్ప్లేను ప్రత్యేకంగా ట్యూన్ చేశారని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ఐఫోన్ 18 ఎయిర్‌లో కొత్త జనరేషన్ ఆపిల్ చిప్సెట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇది గేమింగ్ మాన్స్టర్గా కాకపోయినా, రోజువారీ వాడకంలో స్పీడ్ తగ్గకుండా చూసేలా ఉంటుంది. యాప్స్ ఓపెన్ కావడం ఫాస్ట్‌గా ఉంటుంది, మల్టీటాస్కింగ్ స్మూత్‌గా ఉంటుంది, సిస్టమ్ నావిగేషన్‌లో ఎలాంటి ల్యాగ్ కనిపించదు. ఆపిల్ హార్డ్‌వేర్–సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ వల్ల ఈ ఫోన్ లాంగ్ టైమ్ వరకూ స్మూత్‌గా పనిచేస్తుందని అంచనా. అల్ట్రా స్లిమ్ ఫోన్ అంటే బ్యాటరీ మీద సందేహం రావడం సహజం. ఐఫోన్ 18 ఎయిర్‌లో బ్యాటరీ కెపాసిటీ పెద్దగా ఉండకపోయినా, ఎఫిషియెంట్ చిప్సెట్, ఆప్టిమైజ్డ్ ఐఓఎస్ వల్ల ఒక రోజు బ్యాకప్ ఇవ్వాలని ఆపిల్ టార్గెట్‌గా పెట్టుకుంది. కొత్త పవర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, బ్యాక్‌గ్రౌండ్ యాప్ ఆప్టిమైజేషన్ వల్ల బ్యాటరీ లైఫ్ బాగా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది.
భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్ ధర స్టాండర్డ్ ఐఫోన్ మోడల్ కంటే కొంచెం ఎక్కువగా, ప్రో మోడల్ కంటే తక్కువగా ఉండేలా ఆపిల్ ప్లాన్ చేస్తుందని సమాచారం. అంచనాల ప్రకారం ఇండియాలో ఐఫోన్ 18 ఎయిర్ ధర సుమారు రూ.1,05,000 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ధర లాంచ్ వివరాల విషయానికి వస్తే, ఐఫోన్ 18 ఎయిర్ 2026లో ఆపిల్ సాధారణంగా నిర్వహించే వార్షిక ఐఫోన్ లాంచ్ ఈవెంట్లోనే కొత్త ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు విడుదల అయ్యే అవకాశం ఉంది అని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లాంచ్ సమయంలో ట్రేడ్-ఇన్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు లాంటి వాటిని కూడా ఆపిల్ అందించే ఛాన్స్ ఉందని టాక్.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




