Apple: యాపిల్‌ నుంచి హోమ్‌ డెలివరీ సేవలు.. అందుబాటులోకి కొత్త యాప్‌..!

Apple Introduced Apple App for Indian Users Check Here for Full Details
x

Apple: యాపిల్‌ నుంచి హోమ్‌ డెలివరీ సేవలు.. అందుబాటులోకి కొత్త యాప్‌..!

Highlights

Apple: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్‌ భారత్‌లో తమ వ్యాపారాన్ని మరింత పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది.

Apple: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్‌ భారత్‌లో తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే దేశంలో రిటైల్‌ స్టోర్లను పెంచుకున్న యాపిల్‌ తాజాగా దేశంలో యాపిల్‌ యూజర్ల కోసం కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. యూజర్లకు తమ ఉత్పత్తులను త్వరగా అందించేందుకు యాపిల్‌ ఈ కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఇంతకీ యాప్‌ ఉపయోగం ఏంటి? ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చిందన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్‌ సేవలను, ఉత్పత్తుల కొనుగోళ్లను సులభతరం చేయడమే లక్ష్యంగా 'యాపిల్ స్టోర్' పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ ఇప్పటికే యాపిల్‌ స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. యాపిల్‌ ప్రొడక్ట్స్‌ను యూజర్లకు ఇంటి వద్దకే అందించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను యాపిల్‌ ప్రవేశపెట్టింది. ఇప్పటికే దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఉన్న ఈ సేవలను చిన్న పట్టణాల్లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఈ యాప్‌ను తీసుకొచ్చారు.

కేవలం డెలివరీకి మాత్రమే పరిమితం కాకుండా ఈ యాప్‌లో.. యాపిల్‌ ట్రేడ్‌ ఇన్‌, ఫైనాన్సింగ్‌ ఆప్షన్‌ వంటి కీలకమైన రిటైల్‌ ప్రోగ్రామ్‌ల సమాచారం అందించారు. తాజాగా విడుదలైన ప్రొడక్ట్స్‌, రిటైల్‌ ప్రోగ్రామ్‌ల గురించి అప్‌డేట్‌లు అందిస్తారు. యాపిల్‌ ఉత్పత్తులు హోమ్‌ డెలివరీ, లేదా పికప్‌ సేవల్ని కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా యూజర్లు తాము కొనుగోలు చేసిన యాపిల్‌ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు.

ఇందుకోసం యాప్‌లో ఉండే గో ఫర్దర్‌ అనే ట్యాబ్ సహాయంతో నిపుణులను సంప్రదించవచ్చు. ఇలా దేశంలో యాపిల్‌ సేవలను విస్తరించేందుకు సంస్థ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే 2017లోనే యాపిల్‌ భారత్‌లో ఐఫోన్ల తయారీని ప్రారంభించింది. 2023 ఏప్రిల్‌లోనే దిల్లీ, ముంబయిలో రెండు రిటైల్‌ స్టోర్లను ప్రారంభించింది. త్వరలోనే బెంగళూరు, పుణె, దిల్లీ -ఎన్‌సీఆర్‌, ముంబయిలో సోర్లను ప్రారంభించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories