Apple Pay Later: యాపిల్ కస్టమర్ల కోసం "యాపిల్ పే లేటర్"

Apple Company Announced Apple Pay Later For The Apple Customers
x

యాపిల్ పే లేటర్ (ఫోటో : ఫోర్బ్స్ )

Highlights

Apple Pay Later: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ తమ ఉత్పత్తులను వినియోగదారులకు మరింత అందుబాటులో ఉంచేందుకు ఓ సరికొత్త పద్ధతి ప్రవేశపెట్టబోతోంది. యాపిల్...

Apple Pay Later: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ తమ ఉత్పత్తులను వినియోగదారులకు మరింత అందుబాటులో ఉంచేందుకు ఓ సరికొత్త పద్ధతి ప్రవేశపెట్టబోతోంది. యాపిల్ ఉత్పత్తులు ఏవైనా సరే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రతి నెల పేమెంట్స్ మోడ్ లో ఇన్ స్టాల్ మెంట్లు కట్టుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. గతంలో యాపిల్ సంస్థ యాపిల్ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి, యాపిల్ ఉత్పత్తులను వాడే వారికి యాపిల్ క్రెడిట్ కార్డు ఇచ్చింది. దీని ద్వారా యాపిల్ ప్రోడక్ట్ ఏదైనా సరే కొనుక్కుని పేమెంట్లు వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం ఉండేది. ఇప్పుడు యాపిల్ క్రెడిట్ కార్డు లేని వారి కోసం "యాపిల్ పే లేటర్" అనే సరికొత్త ప్లాట్ ఫామ్ ను యాపిల్ సంస్థ తీసుకురాబోతోంది.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం "యాపిల్ పే" అంటే కస్టమర్లకు రెండు రకాల కొనుగోలు అవకాశాలు ఉంటాయి. ఒకటి ఏదైనా వస్తువు నాలుగు నెలల ఈఎంఐలో కొనుక్కోవచ్చు. రెండవది ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కొని రెండు వారాలకు ఓసారి పేమెంట్లు చేయవచ్చు. రెండు వారాల్లోపు చేసే పేమెంట్లపై ఎలాంటి వడ్డీ ఉండదు. రెండు వారాల గడువు దాటితే మాత్రం వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఈ చెల్లింపులన్నీ గోల్డ్ మెన్ సాక్స్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. త్వరలో భారత్ లో కూడా యాపిల్ పే లాంచ్ చేసి ఈ యాపిల్ పే లేటర్ సంబంధించిన పూర్తి వివరాలు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories