Bitchat: ఇంటర్నెట్ అవసరం లేని కొత్త మేసేజింగ్ యాప్.. బిట్ చాట్‌ను విడుదల చేసిన ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్స్

Bitchat
x

Bitchat: ఇంటర్నెట్ అవసరం లేని కొత్త మేసేజింగ్ యాప్.. బిట్ చాట్‌ను విడుదల చేసిన ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్స్

Highlights

Bitchat: ట్విటర్ మరియు స్క్వేర్ ఇంక్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సరికొత్త యాప్‌ని తీసుకొచ్చారు. దీనిపేరు బిట్ చాట్ యాప్. ఇదొక మెసేజింగ్ యాప్.

Bitchat: ట్విటర్ మరియు స్క్వేర్ ఇంక్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సరికొత్త యాప్‌ని తీసుకొచ్చారు. దీనిపేరు బిట్ చాట్ యాప్. ఇదొక మెసేజింగ్ యాప్. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో అందుబాటులోకి ఈ యాప్‌కు ఇంటర్నెట్, వైఫై, మొబైల్ డాటా, ఫోన్ నెంబర్, సర్వర్లు, యూజర్ ఐడీలు ఇలాంటివేమీ అవసరం లేదు. మరి ఆ యాపీ డీటైల్స్ చూసేద్దామా..

ట్విటర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే బిట్ చాట్ పేరుతో సరికొత్త యాప్‌ని తీసుకొచ్చారు. ఇదొక మెసేజింగ్ యాప్. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. సాధారణంగా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఒక మెసేజ్‌ కూడా మీ ఫోన్ నుంచి వెళ్లదు కదా. కానీ మీరు ఈ యాప్ ద్వారా మెసేజ్ పంపాలంటే దానికి ఇంటర్నెట్ అవసరం లేదు. అంతేకాదు వైఫై, మొబైల్ నెట్ వర్క్, ఫోన్ నెంబర్, సర్వర్లు, యూజర్ ఐడీలు కూడా అవసరం లేదు. ఈ యాప్‌లో పంపే సమాచారం చాలా రహస్యంగా ఉంటుంది. బ్లూ టూత్ సాంకేతికత ఆధారంగా పనిచేస్తే ఆఫ్ గ్రిడ్ పీర్ టు పీర్ మెసేజింగ్ ఫ్లాట్ ఫామ్.

ఈ యాప్ ఎలాంటి సమయంలో ఎక్కువగ ఉపయోగపడుతుంది అంటే టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ లేని సమయంలో బ్లూటూత్ మెష్ నెట్ వర్క్ ద్వారా ఒక వ్యక్తి తన సమీప వ్యక్తికి ఒక మెసేజ్‌ను పంపొచ్చు. ఇప్పటివరకు మనం వాట్సాప్, టెలిగ్రామ్, మెసెంజర్ వంటివి చూసాం. ఇవి ఇంటర్నెట్ లేకపోతే పనిచేయవు. కానీ బిట్ యాప్ అలా కాదు. ఏమీ అవసరం లేకుండానే పనిచేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories