AI+ Smartphones: ₹5,000కే దేశీ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్!

AI+ Smartphones: ₹5,000కే దేశీ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్!
x

AI+ Smartphones: ₹5,000కే దేశీ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్!

Highlights

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో దేశీయ బ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. రియల్‌మీ ఇండియా, హానర్‌ మాజీ సీఈఓ మాధవ్ సేత్ స్థాపించిన నెక్ట్స్ క్వాంటమ్ షిఫ్ట్ టెక్నాలజీస్ సంస్థ, తాజాగా AI+ అనే బ్రాండ్ పేరుతో రెండు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో దేశీయ బ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. రియల్‌మీ ఇండియా, హానర్‌ మాజీ సీఈఓ మాధవ్ సేత్ స్థాపించిన నెక్ట్స్ క్వాంటమ్ షిఫ్ట్ టెక్నాలజీస్ సంస్థ, తాజాగా AI+ అనే బ్రాండ్ పేరుతో రెండు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇవి భారత వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది.

ఈ రెండు ఫోన్లు — AI+ Pulse (4G), AI+ Nova (5G) — మంగళవారం అధికారికంగా లాంచ్‌ అయ్యాయి. డిజైన్, వేగం, డేటా సెక్యూరిటీ వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చి తయారు చేసినట్టు మాధవ్ సేత్ వెల్లడించారు.

ఫీచర్లు ఎలా ఉన్నాయి?

డిస్‌ప్లే: 6.7 అంగుళాల HD+ స్క్రీన్, Pulse‌లో 90Hz, Novaలో 120Hz రిఫ్రెష్‌రేట్

ప్రాసెసర్: Pulseలో Unisoc T615, Nova 5Gలో Unisoc T8200

ఓఎస్‌: Android 15 ఆధారిత NXTQ OS

కెమెరా: 50MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా

బ్యాటరీ: 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్

ధరలు (Variants):

AI+ Pulse (4G):

4GB + 64GB – ₹4,999

6GB + 128GB – ₹6,999

AI+ Nova (5G):

6GB + 128GB – ₹7,999

8GB + 128GB – ₹9,999

లభ్యత:

Pulse మోడల్ జూలై 12 నుంచి Flipkartలో అందుబాటులోకి రానుంది.

Nova 5G మోడల్ జూలై 13 నుంచి విక్రయానికి రానుంది.

ఈ ఫోన్లు బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, పర్పుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనున్నాయి.

ఈ ధరలకు ఈ స్థాయిలో ఫీచర్లతో దేశీయంగా రూపొందించిన AI+ స్మార్ట్‌ఫోన్లు, భారత మార్కెట్‌లో మిడ్-రేంజ్ సెగ్మెంట్‌ను ఆకట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories