ఫ్లిప్ ఫోన్లు ట్రై చేయాలనుకుంటున్నారా? రూ.50వేల లోపలే లభించే బెస్ట్ మోడల్స్ ఇవే!

ఫ్లిప్ ఫోన్లు ట్రై చేయాలనుకుంటున్నారా? రూ.50వేల లోపలే లభించే బెస్ట్ మోడల్స్ ఇవే!
x

ఫ్లిప్ ఫోన్లు ట్రై చేయాలనుకుంటున్నారా? రూ.50వేల లోపలే లభించే బెస్ట్ మోడల్స్ ఇవే!

Highlights

రూ.50,000 లోపు ధరలో లభ్యమవుతున్న టాప్ 4 ఫ్లిప్ ఫోన్ల వివరాలు తెలుసుకోండి. మోటోరోలా, ఇన్ఫీనిక్స్, టెక్నో, శాంసంగ్ లాంటి బ్రాండ్‌ల బెస్ట్ ఫోల్డబుల్ మోడల్స్ ఫీచర్లు, ధరలు, ప్రత్యేకతలతో తెలుసుకోండి.

రెగ్యులర్ స్మార్ట్‌ఫోన్లు (Regular Smartphones) వాడి బోర్ కొట్టేస్తున్నారా? కొత్తగా ఓ ట్రెండీ డివైస్‌ను ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే, ఫోల్డెబుల్ ఫోన్లు (Foldable Phones) లేదా ఫ్లిప్ ఫోన్లు (Flip Phones) మీకు బెస్ట్ ఆప్షన్. ఇవి అందరికీ అందుబాటులో లేవని మీరు అనుకుంటే తప్పే. ఇప్పుడు మార్కెట్లో రూ.50,000 లోపు ధరకు శక్తివంతమైన పనితీరుతో ఉన్న ఫ్లిప్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇక్కడ మీ కోసం భారత మార్కెట్లో లభ్యమవుతున్న 4 బెస్ట్ అఫోడబుల్ ఫ్లిప్ ఫోన్ల (Affordable Flip Phones in India) జాబితా:

1. మోటోరోలా రేజర్ 50 (Motorola Razr 50)

ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1

RAM: 8GB

డిస్‌ప్లే: 3.6-ఇంచ్ ఔటర్ + 6.9-ఇంచ్ POLED మెయిన్ స్క్రీన్

ధర: సుమారు ₹49,999

ప్రత్యేకతలు: స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన పనితీరు, రోజువారీ యూజ్‌కు మేటి ఛాయిస్

2. ఇన్ఫీనిక్స్ జీరో ఫ్లిప్ (Infinix Zero Flip)

  • ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 8020
  • బ్యాటరీ: 4720mAh లిథియం-అయాన్ పాలిమర్
  • కెమెరా: 50MP డ్యూయల్ రియర్ కెమెరా
  • ధర: సుమారు ₹44,999 (ఫ్లిప్‌కార్ట్‌లో)
  • ప్రత్యేకతలు: అధునాతన కెమెరా సెటప్, స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియెన్స్

3. టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్ 2 (Tecno Phantom V Flip 2)

  • డిజైన్: సొగసైన మరియు ప్రత్యేకమైన డిజైన్
  • బిల్డ్ క్వాలిటీ: ఏరోస్పేస్ గ్రేడ్ హింజ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 8
  • ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 8020
  • ధర: ₹54,999 (అమెజాన్‌లో)
  • ప్రత్యేకతలు: మన్నిక, ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు హై ఎండ్ ఫీచర్లు

4. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (Samsung Galaxy Z Flip 5)

  • ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ఫర్ గెలాక్సీ
  • ధర: సుమారు ₹72,000
  • ప్రత్యేకతలు: ఫ్లాగ్‌షిప్ పనితీరు, ప్రీమియం డిజైన్, శక్తివంతమైన కెమెరా సెటప్
Show Full Article
Print Article
Next Story
More Stories