వైరల్ ‌: రోహిత్ చెప్పిన జ్లటాన్‌‌ ఎవరు ?

వైరల్ ‌:  రోహిత్ చెప్పిన జ్లటాన్‌‌ ఎవరు ?
x
Highlights

బంగ్లాదేశ్ తో జరిగే మూడు టీ20లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి లభించడంతో అతని స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా టీమ్‌ఇండియాకు బాధ్యతలు వహించనున్నారు.

బంగ్లాదేశ్ తో జరిగే మూడు టీ20లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి లభించడంతో అతని స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా టీమ్‌ఇండియాకు బాధ్యతలు వహించనున్నారు. భారత జట్టు తాత్కాలిక సారధి రోహిత్ ప్రాక్టీస్ సేషన్ లో గాయపడిన సంగతి తెలిసిందే. అయితే గాయం పెద్దది కాకపోవడంతో ఆయన ఆదివారం బంగ్లాతో జరిగే తొలి టీ20 మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ మ్యాచ్‌కు ముందు మంచి జోష్ వీద కనిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటోను పోస్టు చేశారు. అయితే తమాతో పాటు ఓ జ్లటాన్‌ ఉన్నాడని, అతడితో ఛాటింగ్ చేయడం సంతోషంగా ఉందని‎ కామెంట్ ఉంచాడు. అయితే రోహిత్ పెట్టిన పోస్టులో ఇషాంత్, జడేజా, ఉన్నారు. ఇన్‌స్టా పోస్టులో ఇషాంత్ శర్మ పోనీ టైల్‌తో ఉండటంతో జ్లటాన్‌ అని రోహిత్ సంభోధించాడు. స్వీడన్‌ చెందిన జటాన్ మాజీ పుట్ బాల్ ఆటగాడు. అందుకే రోహిత్ శర్మ తన సహచర ఆటగాడు ఇషాంత్ ను జ్లటాన్‌ గా పోల్చాడు. ఈ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


View this post on Instagram

We got zlatan amongst us. Great fun chatting 😁

A post shared by Rohit Sharma (@rohitsharma45) on

Show Full Article
Print Article
More On
Next Story
More Stories