Richest Pakistani cricketer: అత్యంత ధనిక పాకిస్తాన్ క్రికెటర్ ఎవరో తెలుసా? అతని పేరు వింటే షాక్ అవుతారు

Richest Pakistani cricketer: అత్యంత ధనిక పాకిస్తాన్ క్రికెటర్ ఎవరో తెలుసా? అతని పేరు వింటే షాక్ అవుతారు
x
Highlights

Richest Pakistani cricketer: భారతదేశం లాగే, పాకిస్తాన్‌లో కూడా క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. పాకిస్తాన్ ఆటగాళ్లు క్రికెట్ లోనే కాదు డబ్బు...

Richest Pakistani cricketer: భారతదేశం లాగే, పాకిస్తాన్‌లో కూడా క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. పాకిస్తాన్ ఆటగాళ్లు క్రికెట్ లోనే కాదు డబ్బు సంపాదించడంలోనూ ముందున్నారు. కానీ నేటికీ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్‌లో అత్యంత విజయవంతమైన క్రికెటర్‌గా ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ సంపద గురించి మాట్లాడుకుంటే, అతను తన దేశంలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్. అతనికి దాదాపు 1900 కోట్ల పాకిస్తానీ రూపాయల ఆస్తులు ఉన్నాయి.అనేక కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీగా సంపాదిస్తున్నాడు.

1992 ప్రపంచ కప్‌లో ఇమ్రాన్ కెప్టెన్సీలో పాకిస్తాన్ విజయం సాధించింది. ఇమ్రాన్ చదువులో, క్రీడలలో కూడా అద్భుతంగా రాణించాడు. ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లాడు. అతను 1971 నుండి 1992 వరకు పాకిస్తాన్ తరపున ఆల్ రౌండర్‌గా క్రికెట్ ఆడాడు.క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, ఇమ్రాన్ ఖాన్ రాజకీయాల్లో చేరి, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అనే సొంత పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో గెలిచి పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా అయ్యాడు. ఆయన ఆగస్టు 2018 నుండి ఏప్రిల్ 2022 వరకు తన దేశానికి ప్రధానమంత్రిగా కూడా ఉన్నారు.

ఇమ్రాన్ ఖాన్ తర్వాత, పాకిస్తాన్ మాజీ విధ్వంసక బ్యాట్స్‌మన్ షాహిద్ అఫ్రిది తన దేశంలో రెండవ అత్యంత ధనవంతుడైన క్రికెటర్. అఫ్రిది ఆస్తులు 131 కోట్ల పాకిస్తానీ రూపాయలు.బాబర్ ఆజం ప్రస్తుత స్టార్‌డమ్ పరంగా పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ అని మీరు అనుకుంటే మీరు తప్పు.

Show Full Article
Print Article
Next Story
More Stories