Yash Dayal: అత్యాచార ఆరోపణల కేసు.. బౌలర్ యశ్ దయాళ్‌కు షాక్

Yash Dayal
x

Yash Dayal: అత్యాచార ఆరోపణల కేసు.. బౌలర్ యశ్ దయాళ్‌కు షాక్

Highlights

Yash Dayal: రాజస్థాన్‌కు చెందిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో అతడిపై నమోదు చేసిన కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

Yash Dayal: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బౌలర్ యశ్ దయాళ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. రాజస్థాన్‌కు చెందిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో అతడిపై నమోదు చేసిన కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి జైపుర్ పోక్సో కోర్టు నిరాకరించింది.

క్రికెట్‌లో కెరీర్ చూపిస్తానని నమ్మించి రెండేళ్ల పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జైపుర్‌లో యశ్ దయాళ్‌ను మొదటిసారి కలిసినట్లు ఆమె వెల్లడించింది. అనంతరం కెరీర్ సలహాల పేరుతో హోటల్‌కు పిలిచి లైంగిక దాడి చేశాడని ఆరోపించింది. ఘటనలు ప్రారంభమైన సమయంలో ఆమె వయస్సు 17 ఏళ్లు కావడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ఆరోపణలు రుజువైతే కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, గతంలో ఉత్తర్ ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన మరో యువతి కూడా యశ్ దయాళ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆ వ్యవహారంలో కూడా కేసు నమోదవగా, అలహాబాద్ హైకోర్టు అతడి అరెస్టుపై స్టే ఇచ్చింది.

క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తరఫున అరంగేట్రం చేసిన యశ్ దయాళ్, 2025 సీజన్‌లో ఆర్సీబీ జట్టులోకి వచ్చి కీలక బౌలర్‌గా మారాడు. ఈ సీజన్‌లో 13 వికెట్లు తీసి జట్టు విజయాల్లో ముఖ్య పాత్ర పోషించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories