Yash Dayal : యశ్ దయాల్ కు భారీ షాక్.. ఆ కేసు కారణంగా లీగ్ నుంచి నిషేధం!

Yash Dayal : యశ్ దయాల్ కు భారీ షాక్.. ఆ కేసు కారణంగా లీగ్ నుంచి నిషేధం!
x

Yash Dayal : యశ్ దయాల్ కు భారీ షాక్.. ఆ కేసు కారణంగా లీగ్ నుంచి నిషేధం!

Highlights

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం పేస్ బౌలర్ యశ్ దయాల్‌ను ఇప్పుడు కష్టాలు చుట్టుముట్టాయి. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్సీబీకి ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించిన యశ్ దయాల్, అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు.

Yash Dayal : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం పేస్ బౌలర్ యశ్ దయాల్‌ను ఇప్పుడు కష్టాలు చుట్టుముట్టాయి. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్సీబీకి ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించిన యశ్ దయాల్, అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఇప్పుడు అతడి కెరీర్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. అతడిపై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో ఒక కీలక లీగ్ నుంచి అతడిని నిషేధించారు. యశ్ దయాల్‌పై వచ్చిన లైంగిక దాడి ఆరోపణల కారణంగా అతడిని యూపీ టీ20 లీగ్ నుంచి బహిష్కరించారు. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఈ మేరకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ యువ పేస్ బౌలర్ వచ్చే సీజన్‌లో ఈ లీగ్‌లో ఆడలేడు. యశ్ దయాల్‌పై 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే యూపీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. యూపీ టీ20 లీగ్‌లో గోరఖ్‌పూర్ లయన్స్ జట్టు యశ్ దయాల్‌ను రూ. 7 లక్షలకు కొనుగోలు చేసింది.

మైనర్ బాలిక పై లైంగిక దాడి కేసులో యశ్ దయాల్‌కి రాజస్థాన్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తన అరెస్ట్‌ను, పోలీసుల చర్యలను నిలిపివేయాలని కోరుతూ యశ్ దయాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసు మైనర్‌కు సంబంధించినది కాబట్టి అరెస్ట్‌పై స్టే ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 22న జరగనుంది. వాస్తవానికి యశ్ దయాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇది రెండోసారి. గతంలో, గాజియాబాద్‌కు చెందిన ఒక మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి.

ఆ కేసులో అలహాబాద్ హైకోర్టు అతడి అరెస్ట్‌పై స్టే ఇచ్చింది. కానీ, ఇప్పుడు జైపూర్‌లోని సాంగానేర్ సదర్ పోలీస్ స్టేషన్‌లో 17 ఏళ్ల మైనర్‌పై లైంగిక దాడి చేశాడని కేసు నమోదైంది. ఈసారి రాజస్థాన్ హైకోర్టు అరెస్ట్‌కు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ పరిణామాలన్నీ యశ్ దయాల్ కెరీర్‌కు పెద్ద దెబ్బగా మారే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ 2025లో 15 మ్యాచ్‌లలో 13 వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేసిన యశ్ దయాల్‌కి ఇది చాలా క్లిష్టమైన సమయం.

Show Full Article
Print Article
Next Story
More Stories