ఇంగ్లాండ్ చేరిన న్యూజిలాండ్ టీమ్.. టీం ఇండియా వెళ్లేది ఎప్పుడంటే..?

న్యూజిలాండ్ టీం ఆటగాళ్లు (ఫొటో ట్విట్టర్)
WTC Final: జూన్ 18న ఇంగ్లాండ్ లో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా టీంల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే.
WTC Final Series: జూన్ 18న ఇంగ్లాండ్ లో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా టీంల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈమేరకు న్యూజిలాండ్ టీం ఇంగ్లాండ్ చేరుకుంది. అయితే, అంతకు ముందే న్యూజిలాండ్ టీం, ఇంగ్లాండ్ టీంతో జూన్ 2 నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. నేటి నుంచి వారం రోజుల పాటు న్యూజిలాండ్ ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితవ్వనున్నారు. ఈ ఏడు రోజుల్లో 3సార్లు కోవిడ్ టెస్టులు చేయనున్నారు. ఆ తరువాత ప్రాక్టీస్ మొదలు పెడతారని మేనేజ్‌మెంట్ పేర్కొంది. కాగా, డబ్యూటీసీ ఫైనల్ కోసం టీం ఇండియా జూన్ 2న ఇంగ్లాండ్ బయలుదేరనుంది. అక్కడికి చేరుకున్నాక టీం ఇండియా కూడా కోవిడ్ నింబంధనలు పాటిస్తుంది.
బయో- సెక్యూర్ బబుల్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ల మధ్య టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తరువాత భారత్ జట్టు కూడా ఈ బబుల్‌లో వాతావరణంలోనే మ్యాచ్‌లు ఆడనున్నాయి. కాగా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టీంల మధ్య జూన్ 2న లార్డ్స్ లో మొదటి టెస్టు, జూన్ 10న బర్మింగ్‌హామ్ లో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత జూన్ 18న న్యూజిలాండ్, ఇండియా టీంల మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. డబ్యూటీసీ ఫైనల్ తరువాత టీం ఇండియా, ఇంగ్లాండ్ టీంతో 5 టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు టూర్లకు సంబందించి 20 మందితో భారత జట్టును సెలెక్టర్లు ఇప్పటికే ప్రకటించారు.
ఇంగ్లాండ్ వర్సెన్ న్యూజిలాండ్ షెడ్యూల్
మొదటి టెస్టు మ్యాచ్ - లార్డ్స్ లో జూన్ 2 నుంచి
రెండో టెస్టు మ్యాచ్ - బర్మింగ్‌హామ్ లో జూన్ 10 నుంచి
న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా డబ్యూటీసీ ఫైనల్ షెడ్యూల్
డ్యూటీసీ ఫైనల్ - సౌతాంప్టన్ లో జూన్ 18 నుంచి
ఇంగ్లాండ్ వర్సెన్ వర్సెస్ ఇండియా
తొలి టెస్టు మ్యాచ్ - ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్హామ్ లో ఆగస్టు 4 నుంచి
రెండో టెస్టు మ్యాచ్ - లార్డ్స్, లండన్ లో ఆగస్టు 12 నుంచి
మూడో టెస్టు మ్యాచ్ - ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్హామ్ లో ఆగస్టు 25 నుంచి
నాలుగో టెస్టు మ్యాచ్ - ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్హామ్ లో సెప్టెంబర్ 2 నుంచి
ఐదో టెస్టు మ్యాచ్ - ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ లో సెప్టెంబర్ 10 నుంచి
Second contingent checked and ready! Next stop ➡️ UK 🏏 #ENGvNZ #CricketNation pic.twitter.com/NSqCegtCbW
— BLACKCAPS (@BLACKCAPS) May 17, 2021
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMT