WPL 2025: డబ్ల్యూపీఎల్ ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్.. 6వికెట్ల తేడాతో యూపీ ఓటమి

WPL 2025: డబ్ల్యూపీఎల్ ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్.. 6వికెట్ల తేడాతో యూపీ ఓటమి
x
Highlights

WPL 2025: ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. దీనితో యూపీ వారియర్స్ జట్టు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నుండి నిష్క్రమించే అవకాశం...

WPL 2025: ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. దీనితో యూపీ వారియర్స్ జట్టు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నుండి నిష్క్రమించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో యుపి వారియర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 150 పరుగులు చేసింది. 151పరుుగల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 9 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచింది. హేలీ మాథ్యూస్ ముంబై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆమె 68 పరుగులు చేసి బౌలింగ్‌లో 2 వికెట్లు కూడా పడగొట్టింది.

ప్లేఆఫ్స్‌కు దగ్గరగా ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్ ఇప్పుడు 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి, ప్రస్తుతం 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దీని తరువాత ముంబైకి ఇంకా 2 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ మ్యాచ్‌లలో దేనినైనా గెలిస్తే మాత్రమే ముంబై ఇండియన్స్ కూడా ప్లేఆఫ్స్‌లో స్థానం సంపాదించుకుంటుంది. ఇదే జరిగితే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఇది వరుసగా మూడోసారి అవుతుంది.

ముందుగా, అమేలియా కెర్ ముంబై ఇండియన్స్ విజయానికి పునాది వేసింది. తను 4 ఓవర్లలో 38 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. అయితే, హేలీ మాథ్యూస్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మ్యాచ్ విజయానికి పెద్ద సహకారాన్ని అందించారు. తను బౌలింగ్‌లో 2 వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్‌లో 68 పరుగులు చేసిన ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇన్నింగ్స్‌లో మాథ్యూస్ 8 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టింది. మాథ్యూస్‌తో పాటు, నాట్ స్కైవర్-బ్రంట్ కూడా ముంబై ఇండియన్స్ తరపున బ్యాటింగ్‌లో మెరిశాడు. మిడిల్ ఓవర్లలో 37 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో అమన్‌జోత్ కౌర్ 12 పరుగులు, యాస్టికా భాటియా 10 పరుగులు చేసి ముంబై విజయాన్ని కన్ఫాం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories