ప్రపంచంలోనే అతిపెద్ద మైదానంగా నరేంద్రమోదీ స్టేడియం పేరు...

World Largest Cricket Stadium is Narendra Modi Stadium in Motera | IPL Final Today
x

ప్రపంచంలోనే అతిపెద్ద మైదానంగా నరేంద్రమోదీ స్టేడియం పేరు...

Highlights

Narendra Modi Stadium: అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీ సమీపంలో ఉన్న మొతేరా ప్రాంతంలో నిర్మించిన నరేంద్రమోదీ స్టేడియం...

Narendra Modi Stadium: అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీ సమీపంలో ఉన్న మొతేరా ప్రాంతంలో నిర్మించిన నరేంద్రమోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దదైన క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందింది. ఈ స్టేడియాన్ని తొలుత 1982లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో 49వేల మంది అభిమానులు వీక్షించేందుకు అనువుగా నిర్మించారు. అయితే, 2015 అక్టోబర్‌లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొతేరా స్టేడియాన్ని ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన క్రికెట్ వేదికగా నిర్మించాలని సంకల్పించారు.

సుమారు 800 కోట్ల రూపాయల వ్యయంతో మొతేరా స్టేడియాన్ని పునర్నిర్మించారు. 2020 ఫిబ్రవరిలో ఈ నిర్మాణం పూర్తవ్వడమే కాకుండా సుమారు 1.3 లక్షల మంది అభిమానులు క్రికెట్‌ను వీక్షించేందుకు సౌకర్యంగా ఏర్పాటయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్‌గా ఉన్న ఆ స్టేడియం పేరు 2020 తర్వాత నరేంద్రమోదీ స్టేడియంగా మార్పు చేశారు. స్టేడియం మొతేరాలో ఉండటం వలన మొతేరా స్టేడియం అని కూడా పిలుస్తుంటారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) 90 వేల సీటింగ్ కెపాసిటీతో ఉండగా.. దాన్ని మించి 1.3 లక్షల మంది వీక్షించేందుకు వీలుగా నిర్మించడంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా పేరొందింది. అంతకుముందు వరకూ అతిపెద్ద క్రికెట్ స్టేడియం అంటే ఆస్ట్రేటియాలోని ఎంసీజీ స్టేడియంగానే ఉండేది.

ఈ స్టేడియం ప్రత్యేకతలు ఇవే..

ఈ స్టేడియం సుమారు 63 ఎకరాల్లో నాలుగు ఎంట్రీ పాయింట్లతో విస్తరించింది. స్టేడియం విస్తీర్ణం మొత్తం 180*150 అడుగుల పొడవు, వెడల్పుతో ఉంది. ఒకేసారి నాలుగు జట్లకు డ్రెస్సింగ్ రూమ్ సౌకర్యం కల్పించే సదుపాయం నరేంద్రమోదీ స్టేడియం సొంతం. ఈ స్టేడియంలో మొత్తం ఆరు ఇండోర్ ప్రాక్టీస్ పిచ్‌లు, మూడు ఔట్ డోర్ ప్రాక్టీస్ పిచ్‌లు ఉన్నాయి.

స్టేడియం వేదికగా నమోదైన రికార్డులు..

1986-87లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ గావస్కర్ టెస్ట్‌ల్లో పది వేల పరుగులు పూర్తి చేసి, అప్పట్లో టెస్టుల్లో అత్యధిక పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

1994 ఫిబ్రవరిలో కపిల్‌దేవ్ 432 వికెట్లు పడగొట్టి, అప్పటివరకు సర్ రిచర్డ్ పేరిట ఉన్న రికార్డును బద్దలుగొట్టి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా పేరొందాడు.

1994 ఫిబ్రవరి 8వ తేదీన శ్రీలకంతో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్ సాగి లక్ష్మీ వెంకటపతిరాజు అద్భుత ప్రదర్శనతో 11 వికెట్లు పడగొట్టాడు.

2008లో ఏబీ డివిలియర్స్ భారత్ జట్టుపై డబుల్ సెంచరీ నమోదు చేసుకున్నాడు.

2011 ఐసీసీ వరల్డ్ కప్‌ క్వార్టర్‌ఫైనల్‌లో ఆస్ట్రేలియాను భారత జట్టు మట్టి కరిపించింది కూడా ఈ స్టేడియం వేదికగానే కావడం విశేషం.

2013లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 30 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చర్రిత సృష్టించాడు.

2020 ఫిబ్రవరి 24వ తేదీన నమస్తే ట్రంప్ కార్యక్రమానికి నరేంద్రమోదీ స్టేడియం వేదికగా నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories