
T20 World Cup 2026: జూన్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. టీ20 వరల్డ్ కప్ ఫుల్ షెడ్యూల్ ఇదే!
జూన్ 14న భారత్–పాకిస్తాన్ హై వోల్టేజ్ పోరు.. సెమీస్ దాకా మొత్తం మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌తో టీ20 వరల్డ్ కప్ 2026 క్రికెట్ జ్వరం మొదలు!**
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2026 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జులై 5న జరగనుంది. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తన మొదటి మ్యాచ్‌ను దాయాది పాకిస్తాన్‌తో జూన్ 14న ఆడనుంది. మొత్తం 12 జట్లు పాల్గొనే ఈ టోర్నీని రెండు గ్రూపులుగా విభజించారు. బలమైన జట్లు ఒకే గ్రూప్‌లో ఉండటం వల్ల పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది.
గ్రూప్–Aలో భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. మరోవైపు గ్రూప్–Bలో న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్ సహా ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ పోటీ పడనుంది. ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక టీమ్స్ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫైయర్ మ్యాచ్‌ల ద్వారా బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ వచ్చాయి. గ్రూప్ కూర్పు చూస్తే.. ప్రతి మ్యాచ్ కీలకమేనని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా భారత్ ఉన్న గ్రూప్‌ను ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా అభివర్ణస్తున్నారు. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టోర్నీ మహిళల క్రికెట్లో మరో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించనుంది.
భారత్ మ్యాచ్ షెడ్యూల్ కూడా ఆసక్తికరంగా ఉంది. జూన్ 14న భారత్–పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. జూన్ 17న నెదర్లాండ్స్‌ను ఢీకొట్టనున్న భారత్.. జూన్ 21న దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. తొలి మ్యాచ్ నుంచే కఠిన ప్రత్యర్థులు ఎదురవుతున్న నేపథ్యంలో భారత జట్టుకు ఇది పెద్ద సవాల్‌గా మారనుంది.
భారత్ షెడ్యూల్:
జూన్ 14 - భారత్ vs పాకిస్తాన్ (ఎడ్జ్‌బాస్టన్)
జూన్ 17- భారత్ vs నెదర్లాండ్స్ (లీడ్స్)
జూన్ 21- భారత్ vs దక్షిణాఫ్రికా (మాంచెస్టర్)
జూన్ 25- భారత్ vs బంగ్లాదేశ్ (మాంచెస్టర్)
జూన్ 28- భారత్ vs ఆస్ట్రేలియా (లార్డ్స్)
- Women’s T20 World Cup 2026
- India vs Pakistan
- IND vs PAK
- India vs Pakistan June 14
- WT20 schedule
- ICC women’s T20 fixtures
- Women’s cricket World Cup dates
- India match schedule 2026
- WT20 venues England
- women’s T20 groups list
- Women’s T20 World Cup 2026 schedule
- Women’s T20 World Cup 2026 Schedule Out By ICC
- India vs Pakistan on June 14 in Women’s T20 World Cup 2026
- India women’s Schedule in Women’s T20 World Cup 2026

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




